Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిష్కళంకం, పుష్కరధరప్రతిమానతనూవిలసనం ఆరచితచాణూరనిరసనం, పుష్కరగంగాదిసకలతీర్థవితతీప్రతివర్షసేవ్యమానకౌమారసరసీతటనివాసినం శబరతరుణీవిలాసినం, పుష్కరసమాచరణం కుచేలశరణం, తారకావీననేత్రస్థభీష్మసూజననదేశపాదాంగుష్ఠనఖరం ఖండితకరం, తారకాధీశోద్భవకారణహృదయం సదయహృదయం, తారకమంత్రసారం ధర్మాధారం, తారకాసురారాతిసేవితం తపోధనకదంబసంభావితం, ధనంజయమపినమతాందదానం జగన్నిదానం, ధనంజయతేజోమయస్వరూపం అప్రతిమప్రతాపం, ధనంజయప్రముఖపురాతనసుకవికావ్యాలోకనప్రౌఢిమ దస్మదీయవాక్యసరణిపవిత్రీకరణపారీణశుభచరిత్రం, మణిగణదేదీప్యమానఫణిఫణాయతాతపత్రం ధనంజయసారథిం బాణాగ్రకీలికీలాలేహ్యమానవారిధిం, పుండరీకప్రభృతిపరమభాగవతజేగీయమానానంతలీలావితానం సేవకనితాంతసంతానం, పుండరీకామరహరసఖం అవ్యయసుఖం, పుండరీకనోమకరికరోపమానచతుర్భుజం రక్షితవజ్రం, పుండరీకవిశాలేక్షణం కాళీయశిక్షణం, భద్రకుంభినీప్రముకస్త్రైణభోగానుసంధానుభోగాభిరామం మురవిరామం, భద్రకుంభీనసాధిపశైవేశానం భుజంగపుంగవశయానం, భద్రకుంభిచిరత్న రత్నసందానితగోపురప్రాకారమంటపాలంక్రియమాణనిజదివ్యప్రాసాదమధ్యమధ్యాసీనం పాలితానేకహరిసేనం, భద్రకుంభీంద్రావనం చరితబృందావనం, చంద్రకాంతదరభాసురకరం ప్రపన్నక్షేమంకరం, చంద్రకా్తఖచితవీథిరారజ్యమానకాంచనరథసంచారం నవనీతచోరం, చంద్రకాంతవిభాసమానబర్హావతంసం దండితకంసం, చంద్రకాంతమనోనాథం నీలాసనాథం, కవిరాజమస్తన్యస్తైకపాదం శీతలతులసీదళమాలికామోదం, కవిరాజర్షిసూయమానత్రిలోకవిద్రావణరావణబలఘనాఘనవిధ్వంసనాశుగదాసుగధారాహిండితచండకోదండం కబంధబాహుకదళికాఖండనవేదండం, కవిరాజనోనూయమానావార్యశౌర్యం కొటికందర్పసౌందర్యం, కవిరాజవిరాజితముఖవృత్తనిభందనప్రబంధరాజవిలాసం గోపికావిరచితరాసం, కమలాసనాథబాహాంతరాళం సత్యామానసమరాళం, కమలాసనాతనశాబకవిలోలలోచనోజ్జ్వలకలాగణేయమహిళాసహస్రపరివృతం యశోదోపలాలితం, కమలాసనర్తుమార్తాండసాహాయదాయిబాహారథాంగం గరుడలింగం, కమనాసనాది