పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. వరమురజ దమితనుతహ సరసహాస
రాసలీలాభిలాష వరతమపార్థ
భద్రవస్ఫురవారణాపారభయద
ఫణివరాచలపాల ప్రభాతిరమ్య. 831

గర్భితమంజరి
సురభిభావరాగ సూరాగధామ
వర్థిత దానవవార పారావార

గర్భిత ఆటవెలఁది
సురభి భావరాగ సూరాగణితధామ
నమ్రతారజాత నవ్యభవ్య
వర్యవర్ణిరూఢ వాసవాదర లాప
హీరగౌరసార హారమురజ.

దశావతారగర్భిత గుణిత వర్ణాచలజిహ్వాకోష్ఠ్య వర్ణ భుజంగప్రయాతవృత్తగర్భిత నిరోష్ఠ్యాచలజిహ్వాసంకీర్ణవర్ణ సమగణ దండకము.
జయ హరిగిరిపా భవాకారబోద్ధాగమోద్ధారణా భానుభృద్ధుర్యభి న్నేతరాత్మీయదంష్ట్రాధృతతక్ష్మాతలా భీమరూపా భుజంగేంద్ర వాసస్థ దైతేయరాణ్మస్త విన్యస్త పాదాంబుజా భూరిరాజన్యమార్జ త్కుఠారప్రభా దేవచూడాతి భాస్వద్ధనుర్భంగ బాహాబలా భైరవాంగప్రలంబా శిరచ్ఛేదనోదారసీరాయుధా భోగ మోఘీకృత త్రైపురస్త్రైణపాతివ్రతీభూమ భౌమ ప్రసూవైరి సంహారి గంధర్వ రూపాధికా భంజితస్థైర్య కంసాహిభర్మాంబరశ్రోణిభాగా పయోముగ్విభా భావ్య భాభాగ్వి భావావయోభావయుగ్లోపవామా విభావ్యా భయోగ్యోపమా కుంభి పాపాప భీమా వయో గోపవాగ్భామ వాగ్భూమ భూమీశరశ్చంద్ర చంద్రాళి సచ్చారదా నారదా దిత్యరాడ్దంతి సంతాన ధాత్రీజతారాద్రి తారాశతారేశ శారాచ్ఛనీరేజరాజిద్ధరాధార శక్రానిలార్కా శరాధీశ నీరేశ గంధాంతరాట్కిన్నరేశత్రినేత్రాది దిఙ్నూధ చంచత్కరీటాగ్ర నిర్యత్న రత్నచ్ఛటాసాంద్ర నిర్యద్రజస్సార నీరేజితేడ్యాంఘ్రి నీరేజి నానారతాశ్రాంత నృత్యత్కటాక్షాంచలా నారదారాధ నానారతాహ్లాదితా నీరదాళీలస న్నీల