పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/324

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తేజశ్రితా సారదైత్యచ్ఛిదా చండ చక్రాంచితా శ్రీరసాలంకృతా శేషశైలస్థితా భర్గవాగ్దేవతా వల్లభస్తన్య నైపుణ్య పుణ్యాభిదా భక్తపారంపరీభూరివాంఛాఫలా పాదిపాదాంబుజా త్వం సమస్తాపరాధం సహస్వాద్యమేభూయసీం దేహిభక్తిం భవత్పాదయోః స్థైర్య యుక్తాం విభూతీం నమస్తే నమస్తే నమస్తే హరే. 832

గర్భితాచలజిహ్వాకోష్ఠ్యవర్ణభుజంగప్రయాతము
పయోముగ్విభా భవ్య భాభాగ్ని భావా
వయోభావయుగ్గోప వాామా విభావ్యా
భయోగ్యోపమాకుంభి పాపాపభీమా
వయో గోపవాగ్భామ వాగ్భూమభూమీ.

గర్భితనిరోష్ఠ్యాచలజ్జిహ్వాస్రగ్విణీవృత్తము
నారదా రాధనా నారతాహ్లాదితా
నీరదాళీల సన్నీల తేజః శ్రితా
సారదైత్యచ్ఛిదా చండ చక్రాంచితా
శ్రీరసాలంకృతా శేషశైలస్థితా.

హరిహరాభేద వర్ణనశ్లేషయుక్త కావ్యలింగసీసము
సీ. రమణీయకమలధారణముచే రాణించి
యల వినాయకసేవ నతిశయించి
హృదయంబు శోభిల్లు శ్రీని వేడుక నాని
యబ్జశేఖరమున నంద మంది
యచలశరాసన మమర సంతోషించి
కలధౌతమయవాస మలరఁ గాంచి
గంధగజాసురక్షణదానగతి మించి
పంచాననస్ఫూర్తిఁ బరిఢవిల్లి
గీ. హరుఁడు మీరను భేదమే సరణి లేక
పూని లోకంబులకు నీశుఁడైన తండ్రి
కంటివిన్కలిదంటపేరింటిగుంటి
నడుమ నెలకొన్న వేంకటనాథ శరణు. 833