Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయవిలాసము

గీ. హరినగనిలయ గిరిధర యసురదశన
మణిమయమకుట సురమణి మధువిశరణ
కరివరదకు వరరుచితరవసన న
రహరి లసితదర నిగమ విహరణహరి. 808

(పైపద్యమునందలి గర్భితములు)

1. ద్విపద
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
నారదరుచికాంతి నరఘనపనిత
సారాగధీరవి శదవీనతురగ
భైరవభవజైత్ర భరశుభకరణ
సారాతిహార విసరణ చారణహరి
సారసహితచంద్ర శరజజయనత
వారాశినారద వరపూజితపద
గౌరవకటిఖడ్గ గరళగళసఖ
2. ప్రథమకందము
సారస సమనేత్రయుగళ
నారదరుచికాంతి నరఘనపనితసారా
గధీరవిశద వీనతురగ
భైరవభవజైత్రభర శుభకరణసారా.
3. ద్వితీయకందము
హార విసరచారణ హరి
సారసహితచంద్రశరజ జయనుతవారా
నారదవరపూజితపద
గౌరవకటి ఖడ్గగరళగళసఖ సారా.
4. సమవృత్తము
సారాసారస సమనేత్రయుగళ | సారాధీరవిశదవీనతురగ
సారాహారవిసరచారణహరి | వారా నారదవర పూజితపద