పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/305

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

5. ప్రథమ మహానవమి చౌపది
సారాగ్ర్యసారస సమనేత్రయుగళ
నారదరుచికాంతినరఘనపనిత
సారాగధీరవిశదవీనతురగ
భైరవభవజైత్ర భవశుభకరణ.
6. ద్వితీయ మహానవమి చౌపది
సారాతిహార విసరచారణ హరి
సారసహితచంద్రశరజ జయనుత
వారాశి నారదవర పూజితపద
గౌరవకటిఖడ్గగరళగళసఖ.
7. ఆటవెలఁది
నారదరుచికాంతి నరఘనపనితసా
భైరవభవ జైత్రభర శుభకర
సారసహితచంద్ర శరజజయనుతవా
గౌరవకటిఖడ్గగరళగళసఖ.
8. తేటగీతి
సారససమనేత్రయుగళ నారదరుచి
ధీరవిశదవీనతురగభైరవభవ
హారవిసరచారణహరిసారసహిత
నారదవరపూజితపదగౌరవకటి.
9. మదనవిలసిత వృత్తము
నర ఘనపనితా
భర శుభకరణా
శరజజయనుతా
గరళగళసఖా.
10. తురంగవృత్తము
తానాతానన. సారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘనపనిత
ధీరవిశదవీనతురగ భైరవభవజైత్ర భరశుభకర
హారవిసరచారణహరి సారసహితచంద్ర శరజజయనుత
నారదవరపూజితపద గౌరవకటి ఖడ్గ గరళసఖ.