పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxix

అని వ్రాసియుండుటవలనఁ జక్రబంధమునకు లక్షణము పూర్ణముగాఁ దెలిసినది. బంధములలోఁ గృతిపతి పేరు, కృతికర్త పేరు నిమిడియుండు బంధమిది యొకటి గాని మఱి గనుపడవు. బంధస్వరూపమునందెన్ని నియమములగుపడుచున్నవో యవి యన్నియు శ్లోకమునఁ గూర్పబడియున్నవి. ఈ చక్రబంధమునందు శార్దూలవృత్తము ప్రాయికము... ఈ విధి ప్రకారము వ్రాసి చదివినయెడల మూఁడవవలయమునఁ గవి పేరును, ఆఱవవలయమునఁ గృతిపతిపేరును గోచ రించును. ఈ నియమము మఱికొన్ని చక్రబంధములలో మఱియొక విధముగా గనుపించుచున్నదిగాని నాల్గవ వలయమునందెక్కడను గృతిపతి పే రగుపడదు. ఇది బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవశాస్త్రులు బి.ఎ గారు రచించిన “ఆంధ్ర రఘువంశము" లో ముద్రింపఁబడియుండు చక్రబంధమునందు 'గ్రిగ్గుదొరపతి' యని నాలవ వలయమున నగపడుచున్నది" తర్వాత వీరు ఆంధ్రవాఙ్మయము నందలి లెక్కలేని ప్రబంధములయందుండి ఉదాహరణములు చూపి... “నాలవ వలయమున నెవ్వరును వ్రాసియుండలేదు... పైన వ్రాయఁబడిన చక్రబంధ పద్యములయం దన్నిటను 3-6 వలయములయందు కవి కృతిపతుల పేళ్లగుపడుచున్నవి. వాసుదేవ శాస్త్రులవారి చక్రబంధమునందు నాఱవ వలయమునఁ గవి పెరగుపడుచున్నను...ఏలకో...'వాసుదేవకృతి' యని తమ పేర ప్రదక్షిణంబు గను బంధమున నెలకొల్పియున్నారు ఇది. చింత్యము”

ఈ ప్రబంధరాజములోని 881 వ పద్యమగు చక్రబంధమునందు మూడవ వలయమున “కవి వేంకటాద్రి' యనియు, నాఱవ వలయమున 'ప్రబంధ రాజము' అనియు వ్రాసియున్నది. ఇట్లు వ్రాయుటకుఁ గారణ మూహించునది. సాహిత్యరత్నాకరములోని ఈ క్రింద నుదహరించిన చక్రబంధ శ్లోకమున మూఁడవ వలయమునందు 'ధర్మ సూరికృతిః' అనియు, ఆఱవవలయమున 'రామ గుణ నుతిః' యనియు, 'రథపదబంధ' మనియు వ్రాయబడియున్నది. ఇది చూడగా నీ చక్రబంధము నేర్పఱచుటయందుఁ బాండిత్యము ననుసరించి చిత్రముగాఁ గవి తన కిచ్చవచ్చినట్టు నేర్పఱుపవచ్చునని తోఁచుచున్న ది.

“ఇఁక సాహిత్యరత్నాకరములోని చక్రబంధ శ్లోకమున చూడుడు

  శ్లో. “దర్బాంధ ప్రసరాసురస్థిరమద ప్రాణప్రహార క్రియో
       విష్ణుర్మన్మథ మన్మథస్థ్సిరశివం భానుక్షపాకృత్ప్రభాం
       దత్తాం సూనృత గుర్విపద్దర విధస్ఫాతిః ప్రహేతిః పరం
       రమ్యోమే దయయా విరాధదమనో యోగీంద్ర భావ్యశ్చిరం.