పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

xxviii

“ఇఁక చిత్రకవిత్వ విధమెట్టిదనఁగా ననులోమ విలోమమము, ఓష్ణ నిరోష్ఠ్యము, తలకట్టులు, గుడులు, శృంగములు, అక్షరవిలోమము, పద్యభ్రమకము, ఎకపది ,ద్విపద, త్రిఁపది, యేకాక్షరి, ద్వక్షరి, నిస్తాలవ్యము , నిష్టంఠ్యము, నిర్దంత్యము, నిర్మూర్దన్యము, నిరంతస్థము, నిర్మూష్మకాదులచేఁ బద్యములు వ్రాసిరేని యది చిత్రకవిత్వమనిపించుకొనును. ఈ చిత్రకవిత్వమును నిక్కవియు నీగ్రంథ మునందు 75, 214, 221, 222, 230, 366, 392, 807, 808, 832 లో 1, 2, 849, 877, 878 యీ పద్యములలో వ్రాసియున్నాడు. వీనికి లక్షణములు అప్పకవీయాది తెలుగుగ్రంథములయందుండును సాహిత్య రత్నాకరములోనగు సంస్కృత గ్రంథములయందును వ్రాయఁబడియున్నవి.

“ఈ గ్రంథమునందు గోమూత్రీకాబంధము, ఛత్రబంధము, నాగ బంధము, ఖడ్గబంధము, చక్రబంధము, గుచ్ఛబంధము, హలబంధము, అష్టదళ పద్మబంధము, రథబంధము, పట్టిసబంధము, త్రిశూలబంధము, పాదహబంధము, చతుర్దశగర్భితద్వాదశ దళపద్మబంధము, పుష్పమాలికా బంధము, మహా నాగ బంధము, లోనగు బంధములు వ్రాయబడియున్నవి. ఈ బంధగ్రంథగ్రంథములు వ్రాయబడిన తాళదళసంపుటములు మాకు హస్తగతమై, బంధస్వరూపములు తెలిసినను బంధ లక్షణములు తెలిసికొనుటకు ప్రయత్నించగా కావ్యాలంకార చూడామణీ నరసభూపాలీయములయందుఁ గొన్ని బంధములకు మాత్రము ఈ క్రింద వ్రాయబడిన విధముగ లక్షణము వివరించి యున్నది.

         (a) కావ్యాలంకార చూడామణియందు.... (చూ. కావ్యా. “వలయదళంబు ' నర. భూ.
           పదిచుట్లు నాఱురేకులు...
         “... పై లక్షణకారుల పద్యములు చక్రస్వరూపమును తెలిసికొనుటకు చాలదని విచారించి సాహిత్యరత్నాకరమును చూడగాఁదద్వాఖ్యాన కర్తయగు బ్రహ్మశ్రీమల్లాది లక్ష్మణ సూరి విరచితమగు మందరమను పేరుగల వ్యాఖ్యానము నందు నీ క్రింది లక్షణము శ్లోక రూపముగ వ్రాసియున్నది.

     శ్లో. బధ్యతే షడరం చక్రం ప్రత్యరం తన్న వాక్షరం
         త్రయాణామపి పాదానాం దశమం కర్ణికాక్షరం
         ఆదితస్స్వస్వతుర్యారై స్త్రయః పాదాశ్చతుర్థగాః
         వర్షాఃషష్టాణంత్యమారభ్య సంవదంతేంతి మాక్షరైః
         మధ్యేద్వౌద్వౌవిసంవాదౌ షడరేషు క్రమాద్భవేత్
         చతుర్థేసప్తమైర్వర్ణేర్వర్ణనం కవివర్ణ్యయోః"