Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxx

ఆత్ర తృతీయవలయే 'ధర్మసూరి కృతిః' షష్ఠే 'రామగుణనుతిః' అష్టమే ‘రథపదబంధః ' ఇతిచ ప్రతీయతే, బవయో రభేదాత్ | ” అని సాహిత్యరత్నాకరములో వ్రాయఁబడియున్నది.

“ఈ చక్రబంధమును 'షడరచక్రబంధము' అని మఱియొక నామమున బిలుచుచున్నారు. 808వ సీసపద్యములోని వింశతిభేద బంధకందము చక్ర బంధముతో నిమిడ్చి వ్రాసియున్నది. ఇందులకుఁ గారణము మృగ్యము. వెండియు ద్విచతుష్క చక్రబంధమనియు, చతురస్ర చక్రబంధమనియు, గరుడ గతి చక్రబంధ మనియు, అష్టాక్షర చక్రబంధమనియు నీ పేర్లం బరగు కొన్ని బంధములను వానివాని స్వరూపములను బళ్లారి జిల్లాలోని చినబల్లాపుర వాస్తవ్యులగు శ్రీమాన్ గోపాలాచార్యులవారు గురుమూర్తి నాయనింగూర్చి వ్రాసి యున్నారు. ఈ బంధభేదములకు లక్షణమువిచారించునది. శ్రీమాన్ గోపాలా చార్యులు విరచించిన బంధములన్నియు వాని నిజరూపములతో 1872 సంవత్సరమునందు ముద్రింపబడియున్నవి గాన వాని స్వరూపముల నాపటములందుఁ జూచుకొనునది.

(b) ఇక గోమూత్రికాబంధ లక్షణము కావ్యాలంకార చూడామణి యందు నివ్విధముగా వ్రాసియున్నది.

      20. తే. “వర్ణములుమూఁడు పంక్తుల వరుసవ్రాసి
               మూలలం దోలి గోమూత్రలీలఁ జదువ
               నుక్త్య పద్యంబు దానగు చుండెనేనిఁ
               దనరు గోమూత్రికాఖ్య బంధంబుననగ.”

ఈ గోమూత్రీకాబంధనమునకు లక్షణ మితర గ్రంథములయం దగుపడదు. సాహిత్యరత్నాకరమునందు గోమూత్రికాబంధ, చక్రబంధ, మురజబంధ, అష్టదళపద్మబంధ, క్షురికాబంధ, సర్వతోభద్రబంధ, ఖడ్గబంధ, హలబంధ, చాపబంధ, గుచ్చబంధ, మత్స్యబంధములు వ్రాయబడియున్నవిగాని వ్యాఖ్యా నమునందు లక్ష్మణసూరిగారు అష్టదళపద్మబంధ, నాగబంధ, చక్రబంధములకు దప్పఁ దక్కిన బంధములకు లక్షణము వ్రాయరైరి. ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానమునందును నిమ్మూటికి మాత్రమే లక్షణము వ్రాయఁబడియున్నది.

(c) ఇఁక అష్టదళ పద్మబంధమునకు నరసభూపాలీయమున నివ్విధముగ లక్షణము వ్రాయబడియున్న ది.