పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పులుగుల మట్టున చట్టంబుల నెగయు నాకాశబాణంబుల దురుసున నిచ్చవిచ్చల విచ్చుమొగ్గ విరాలిమొగ్గగా కంచుమించై చిందరవందరై చీకాకై తారుమారై పంచబంగాళమై చెల్లాచెదరై గజిబిజియై బెండాబెడగై కకావికలై పటాపంచలై యథాయథలై జలకట్టెల తండంబులై గొఱ్ఱెదాటులై జిరుకుబండమీఁది పోకలై జల్లించి యొకడుపోయిన త్రోవ నొకఁడు బోక నొకనివెంట నొకఁ డంటక నొక్కనిపల్కు నొక్కఁడు వినక నొకనిమొగం బొకఁడు సూడక గొందఱు పిలపిలంబారి యీబారి దప్పిన బలుసాకుఁ దిని బ్రతుకవచ్చు ననుచఁ దిరిగిచూడక కాలికొద్ది వడిఁ జూపువారును గొందఱు బిరబిర బోలేక పొట్టిపొట్టల బరువున బుసకొట్టుచు నడుగులు దడబడ బోరగిలఁబడి యతనిభక్తుల సూటి పొర్లుదండంబుల వగలఁ బొర్లిపొర్లి పోవువారును కొందఱు దులదుల బరతెంచి దడదడ గుండెలు దల్లడములంద గన్నులఁజీకట్లు గ్రమ్మఁ దెరవులు గానక నిండుచెఱువులు జొచ్చి యఱ్ఱులబంటినీళ్ళలో నిలిచి తెలివిదప్పి డప్పియమవారును కొందఱు దుడిదుడిబోయి పదము పదమున దాఁకి మ్రొగ్గి దిగ్గున లేచి కాట్రేడా యీతూకు దరిఁజేర్చితేని నీపొలముచుట్టు క్రొవ్విన మెకంబుల కఱకుట్లు తోరణంబులు గట్టించి జాతరలు సేయించెదమని వేడుకొనువారును కొందఱు బుడిబుడి జని దూపను జాలిబట్టి తెప్పరిలి తమయాకిరాండ్ర సూడఁగలిగిఁ జాలు కంబమురాయా నీకుగల పణ్యారములు సాగింతు మనుచు జగ్గుజగ్గున పరువులెత్తి తొడలు వడంక తొట్రిలి మొగ్గి తగ్గుచు దగ్గుచు గేకరించి నాలుకలఁ దడిలేక నుమియకు లోఁజిక్కి గుఱ్ఱుగుఱ్ఱున మూల్గుచు నీల్గుచుఁ బోవువారును కొందఱు గునగున నేఁగి చేరువఁ బుట్టలఁ జేరువారును కొందఱు నోటిబీగముల దాసళ్ళ పెల్లున నోరులఁ బూరులు గఱువారును కొందఱు తిరునాళ్ళ ప్రజనిజముననో వేంకటేశా శరణు శరణు కావు కావు మని గోవింద లిడువారును కొందఱు బిరబిర గట్టులెక్కువారును కొందఱు దొందుమేనల నిటునటు కదలలేక జీనిపందుల పొందికను రక్తార్ద్రవసత్రంబులతో బ్రాణాచరంబులు మెళకువ నొదిగి తలక్రిందఁ జేతు లిడికొని ‘యో వడ్డికాసులస్వామి యీమాఱు గాచిన బిడ్డలం గని మీపేరుఁ బెట్టెద’ మని మ్రొక్కుచుఁ గన్నులు మోడ్చుకొని యుండువారును కొందఱు దొమ్మరుల గుఱుతన నహహాయని బడితీఁగెల వెంబడి నెగఁబ్రాకువారును కొందఱు బెరుకు బాపనపిసాసి బోయల