పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ. నిన్నియునుగాక యూరకే యేలమాను
వారకాంతల చెంతలఁ జేరెనేని
యేడకుల మేమివర్తన మెట్టినడక
యేటిగౌరవ మేమని యెన్నగలదు. 755

గీ. తల్లిదండ్రులు వాని వర్తనము రోసి
ప్రాణములు దాఁచుకొనెడు లాభంబు గనిరి
వారి శుశ్రూషయందుఁ దద్వనిత యుండె
వాఁడు రెంటికిని జెడిన రేవణుని బోలి. 756

క. విచ్చలవిడి లంజల దిన
వెచ్చములకు జూదగాని వెచ్చములకు ని
ప్పచ్చరమై తనలాహిరి
వెచ్చములకు లేక మ్రుచ్చు విద్యకుఁ జొచ్చెన్. 757

వ. ఇత్తెఱంగున కన్నాగదత్త నిభుండగు నాగదత్తుండు ధీరశాంతనాయకత్వం బుద్వాసనంబు జేసి గానంబు కవితయు కొక్కోకంబు జూదంబు దేశభాష లిపిజ్ఞానంబు లిపిలేఖనంబు చరాచరాన్యధాకరణంబు విలువిద్యయు సర్వజ్ఞానపరిజ్ఞానంబు శాకునంబు సాముద్రికంబు రత్నపరీక్ష అరదంబుఁ బఱపుటయు తురగారోహణంబు మల్లశాస్త్రంబు పాకచమత్కారంబు దోహదప్రకారంబు ధాతుగంధరసవాదంబులు కుట్టుపనుల వినోదంబు మహేంద్రజాలంబు జలాగ్నిస్తంభనంబులు మొనకట్టు వాకట్టు వయస్తంభనంబు వశ్యాకర్షణమోహనంబులు విద్వేషణోచ్ఛాటన సంహరణ కాలవచనంబులు పక్షిగతిభేదంబులు యోగరాగంబు వచనసిద్ధి ఘుటికాసిద్ధి యింద్రజాలంబు అంజనంబు ధ్వనివిశేషజ్ఞానంబు వంచనంబు స్వరవంచనంబు మతిమంత్రౌషధక్రియలు చోరత్వంబు చిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబు కాసెపనియు కులాలకర్మంబు వడ్లంగిపనియు మేదరపనియు జోళ్ళు నిర్మించుటయు సాలెపనియు నదృశ్యకరణి దూత్యకరణి వేఁటసన్నాహంబు బేరంబు పాశుపాల్యంబు కృషియు మైరేయంబులుగూర్చు వగలు లావుక కుక్కుట మేషాదులఁబోరు హత్తించుటయు ననెడు చౌషష్టివిద్యల నెఱింగి దత్తరమ్ముల కొదలేక యదరు