పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బెదరు సోకనీక మదముమీఱ ముదముదేర నొంటికి నొంటిదప్పికి దప్పి నిదురకానిదుర చేసి తనతోవాసికి నుర్వర నెవ్వరైన నాన బూనుదురా నుదురకన్నుగల దొర నెదురుకాక నిఁక నీదైవానుగ్రహంబున నిజదురాగ్రహంబునను నుగ్రారివిగ్రహంబులు విగ్రహంబున నిగ్రహంబు సేయు జాగ్రతనుం దేరి కాదంబరీపానవాదంబున మోదంబు మీఱి జూదంబున చౌర్యవినోదంబున సంసారఖేదంబు విడిచి లజ్జగడచి మట్టువీడి గుట్టుఁబోనాడి రట్టునకు లోగి పెట్టునకు నాగి పెక్కుమాట లొక్కచోట పిక్కటిల్ల తక్కువెల్లజూటువగలు మాటతెగలు చాల దెలిసి లీల మలసి వడిసుళ్ళనుబడి గుళ్ళను జరియింపుచు సిరిపెంపుచు నిజజంజన్యమానకైతవగాత్రుండును తంతన్యమానదురితచరిత్రుండును పాపఠ్యమానాంబుస్వీకృతకలితముఖుండును రారజ్యమానదుష్టసఖుండును నగుచునగుచు నందునందు నందుఁజెన్నొందు వాసరమ్ములు మీసరమ్ములుగాఁ జాల కడపట గడపంజాలక. 758

గీ. కావు ములుబంతి సికముళ్ళు గద్దగోరు
నల్లదట్టిసబిల్ల కన్నంపుకత్తి
బూది దివ్వార్పుపురు విసుమూదు గ్రోవి
తోలు నిచ్చెన మొదలు ముందుగ ధరించి. 759

అశుభశకునములు
సీ. ఎచట కేగెదవని యెవ్వరు నడుగక
తంబళి బాపఁడు తారసిలక
తుమ్మెడు పులి నక్క తోడువచ్చెదనను
పలుకులు వీనుల వినక పిల్లి
యడ్డంబుగాకను గొడ్డురా లెదుటను
నిలువక జాగిలంబలుకుడిడక
పాలవెన్కకుఁ బోక పక్కిపై రొప్పక
పొనుకుఁబడిన యగ్గి బొగ్గులు దిస
గీ. మొలనరు పరపు మైలచీరలు దూది
కసవు తొండయు గుడ్డి మూగ కఱిచిలువ