పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భంబని విజృంభించుచుఁ బాషండహృత్పుటభేదనంబగు నిజపుటభేదనంబునకుఁ జేరు నయ్యభ్యంతరంబున. 605
నాగదత్తోపాఖ్యానము
ద్విరుక్తిరూపకనియమదళత్రయఘటితచరణసీసము
సీ. రసరసాధికసంతమసమసారగవి
హాయససాధూన్నతి హర్మకంబు
ధరధరార్చకమహీసురరాజకవైశ్య
వరవరావరవర్ణగురుతరంబు
మదమదావళబలాస్పదపదాత్యాజితో
విదవిదాశ్వశతాంగవిలసితంబు
నవనవామోదసూనవనవనవాపుత్థకై
రవరవాన్వితబంభరవ్రజంబు
గీ. వెలయుఁ బారావతారవకలితలలిత
భావసంభావకేళికాప్రౌఢరూఢి
వారవారణయానాంఘ్రివనజరణిత
వితతమణినూపురంబు తిరుపతిపురంబు. 606

వ. ఆపురవరంబున.

మ. కలఁ డభ్యస్తసమస్తశాస్త్రనిగమగ్రంథార్థసంఘర్షని
స్తులవాచారభటీధురాధరితసింధుప్రోల్లసల్లోలని
ర్మలకల్లోలఘుమంఘమారవయశోమాన్యస్వకీప్రథా
కలనాధర్ముఁడు మాధవుం డనెడు సత్కర్ముండు ధాత్రీస్థలిన్. 607

గీ. ఆతఁడు బహుకాలమున నొక్కసుతుఁడు గలుగ
జాతకర్మాది శుభవిధు ల్సంఘటించి
భూరియిడి నాగదత్తుఁ డన్బేరు పెట్టి
ప్రేమఁ బోషించి వడుగును బెండ్లి సేయ. 608