పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొడియలును గ్రొమ్మావిపండ్లకై మలసి చుట్టు వ్రాలిన రాచిలుకల తెఱుంగున బచ్చఱాల కెంపురవల చెక్కడంబు రంగారు బంగారు చిలుకలదిండ్లును జీనానూలిత్రాళ్ళును నేనుఁగుకొమ్ముపోటుపెరుకు గఱినరుకులాకు జీరవెండవీటిక నులివంక యగ్గిసోఁకుడు పొక్కిడిపులుగు ముక్కునొప్పు పుప్పి చీమదిండి యేకలమ్ము సెలవు నిడుద గణుపు లేఁతయు ముదురు సన్నము గమకంబు నీలధవళరక్తహరిద్వర్ణంబులు మొదలుగాఁగల దుర్గుణంబులు లేక వీఁకగాఁబసపునిగ్గుచే మొదటినుండి సోయగమ్మునఁ బెరిగి వెనుక నెనిమిది ముంగల తొమ్మిది నడుమ కుఱుచ గణుపు వీరైదు నొకటి గలిగి యోరశిరంబుగా తెఱగంటి దొరవింటి తెఱగంటిన కొమ్మును, బికిలిపూ పన్నాగంబును, సూర్యపుటపుటొఱుగును గల యందలమ్ము నధివసించి యాత్మీయసేనాపరివృతుండై ముక్కుల తుదలఁ జుక్కబొట్టులు జెవులమూయు కుళ్ళాయిలు కటులనీలికాసెలు జొనిపిన కుఱుచపిడెమ్ములు జంకలవ్రేలెడు తోస్తానంపుఁదిత్తులు బదంబుల బిగువారు బిల్లమెట్లు నిరుకువీఁపులు సందిళ్ళ గడియంబులు కాయలు గాచిన నెగుభుజంబులపైఁ దడిబట్టపొత్తులు దనరుబెస్తలు సిస్తుగా మోచి నిబ్బడుగు ముండ్లడియంగాలజడుపు వైసరంబోరడి యడుగులో జతనము మోరడి బలిమికం బొద్దిక బొట్టడి చిట్టడిమోపనబదిలము మించడుగు దువాళిసమాధానజల్లిక లుప్పరము కిరడుపాదబెళుకడుగు లోదాటునిబ్బరము జడుకులో జీవదాన పాదొత్తుగల్లు కరెకప్పుపటము తాకుడుమైసుళువుమారు వెంబడి మెదుగుడు సెలవుచోరుగొమ్ము మోపడుగు నీరడికండబలిమిలాగు మోపులహొయలు బిగువు మొల్లడిపదిలము హెచ్చరిక స్వామిపరాకన విని సంతసిల్లు కంసారి మునుపుసారి వెడలిన దారిని దుముదారిగా వేగంటిదునేదారి రాజసమ్మునగు మీసరమ్మునఁ దచ్ఛుభవాసరమ్మున వచ్చునప్పుడప్పడవాళ్ళేతెంచి సాష్టాంగదండంబు లాచరించి లేచి శంకలేక సంకలఁ జేతు లిడుకొని యందుఁ గొందఱు కరమ్ముల వాతెఱలు మాటుకొని తగ్గిమెల్లనె సవినయంబుగా ‘నో, లోకనాయకా యీయిక్క నొక్కమొక్కలంపు బోయరాయిడి సేయుచు దేవరకు గనుంగొనువాఁడైయున్నాఁ’ డనిన ననితరసాధారణదారుణభుజప్రతాపాటోపంబు దీపింప విజయభేరీదంధణధ్వానంబులు దిక్కు లదర రథగజతురగపదాతులతోడఁ గదలి వచ్చునదియు జైత్రయాత్రాసంరం