Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiv

పద త్రయ గోపకము, ఇందు విభాషపదాలు ఆఱు, స్తబకావళి, మిథునావళి, నిరోష్ఠము, అక్షర ముష్టిక నిర్మూర్ధనము, అపశబ్దాబాష అనావృతాక్షరము, ఈపద్మబంధమునందు శ్రీగుండయ అనేది నామమున్నది. ఈశ్లోకము రెండు గోమూత్రికలు. ఈ రెండుంగూడ జాలబంధము, ఈ పద్మవృత్త మునందు వాసినది గూఢ చతుర్ధమైన పద్మవృత్తము. ఇది చదివేక్రమము ప్రమొదలుగాను రేకులు తుదల మొదలిఅక్షరాలు పాదము, ద్విమొదలైన మొదలి అక్షరాలు రెండవపాదము, విమొదలైన రెండవ అక్షరాలు మూడవ పాదము, నాల్గవపాదము ఈ మూఁడు పాదాలందునున్నది, ఈపాదము లరిత కౌతుక రసప్రభతోషిత కాచకమ్ ... 'చక్రబంధము.'

ఒక చిత్రమేమనఁగా పెద్దయామాత్యుఁడును ఈశ్వరభట్టోపాధ్యాయులును సమకాలికు లగుచున్నారు. ఏక కాలమున దేశమందు ఈ చిత్ర బంధకవిత్వాదుల స్పురణమును విచిత్రమే. ఇట్లు తిక్కన చేయని, ఆయన శిష్యులను చేయని, యీచిత్రకవిత్వమును తిక్కనకు తర్వాత అచిరకాలములోనే తెనుఁగున కొందఱును, సంస్కృతమున సరే ఎట్లును పూర్వమార్గము ననుసరించిన కొందఱును చేయుచుండిరనఁగా నిదిదేశమందు కలిగినదే. సామర్థ్యము పై నాధారపడినందున అంతవ్యాప్తికి రాలేదని తెలియుచున్నది. జక్కన కాలము సుమారు క్రీ. శ. 1375. ఎఱ్ఱన కించు సమకాలికుఁడు, శ్రీనాథుని కన్నను పెద్దవాఁడు, తనకాలవు కవితారీతుల నిట్లు చెప్పినాఁడు.

      “ప్రతిభాగుణధురీణ పౌరాణిక త్రాణ, సకలపురాణశాస్త్రములయందు,
       బరమార్థ చరితార్థ భారత రామాయణాది ప్రబంధకావ్యములయందు,
       గల్పాంతరస్థాయి గద్యపద్యపాయకమనీయ చిత్రకావ్యములయందు,
       రసికజనానంద రససుధానిష్యంద విలసిత నాటకావలులయందు.

       సకల దేశ భాషా విశేషములయందు,
       వం సఁ బ్రఖ్యాత మనఁగ నుత్పాద్యమనఁగ
       మిశ్రమననొప్పు సత్కథామేళనంబు
       లెన్ని యన్నియువిన్నాఁడ బిన్ననాఁడ."

ఇవన్నియు సిద్ధయామాత్యుఁడు చెప్పినట్లు జక్కన వ్రాసినాఁడు. తెలుఁగునుగూర్చియా సంస్కృతమును గూర్చియా? తెలుగులో నాటకము లేవియుండినవి, నాఁడు లేవే! సంస్కృతాంధ్రములు రెంటిని కలిపి