పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుభలక్షణవచనము
వ. అప్పు డన్నరపతి యొఱ పతిశయిల్లు కడలి యిల్లుగాన మరి తన కల్లుఁడైన గోవిందునకుఁ దన తనయపొత్తున నారగింపు జేయించి, తనకోర్కె సఫలం బాయెనని యెంచి యవ్విరించి జనకునకు నరణంబుగా మించులు గండపెండెరంబులు రాకట్టు మొలకట్టు లుంగరంబులు ముంగైమురారు లంగదములు చేసరులు చేకట్టులు హంవీరతాయెతులు తాళీలు కంఠమాలికలు కంఠసరు లుత్తరిగెలు చౌకట్టు లొంటులు మురువులు తురాలు కిరీటంబులనం బరఁగు నాభరణంబులును పీతాంబరంబులు నీరాదులు బురుసాలు వన్నెమణుంగులు చందరుకావులు గంధకావులు మాదళంబులు తోఁపులు మేఘవర్ణంబులు పచ్చపట్టులు చీనీలు శాలువలు కబ్బాయిలు నడికట్లు చౌదగులు హాసావళులు తగటిపాగలు చలికప్పదంబులు సకలాతిగుడారములు బుర్నీసు బల్లాని తెట్టులు తిప్పనక్క గోడసరాదుల పటవిశేషంబులు ఫిరంగికత్తులు బంభురగంధ సింధురసైంధవ శిబికాందోళికోష్ట్ర సందోహంబులు సోగసన్నంపు గోమపేముటానియ బల్లిదంపుటల్లిక నాబరించు జిబునీ జిబుకుతినీబపంతి వింతఁజూపట్టు కెంబట్టు చందవాపొందికఁ జెంది జనుల గనుబండువులగు హొయల్ బండులును రత్నకంబళంబులు దుద్దుగంబళులు జమ్ముఖానాలు జమకాళంబులు తివాసీలు పట్టుచాఁపలు పగడాలకోళ్ళమంచంబులు కుంకుమపువుపరపుఁ బఱపులేకరంగీతలాడలును సుళువుతాప్తాకురాడంబులు పరంగిపీటలు చదరంగంబులు పగడసాలలు హొన్నంచుసురఁటులు ఛత్రచామీకరముకురవీటికాకరండకర్కరికాకుళాచికాబిరుదధ్వజంబులు జాలవల్లికలు పింగాణిగిన్నియలు పన్నీరుచెంబులు గంధపుమ్రాకులు జవ్వాదివంకులు కస్తూరివీణెలు పునుఁగుజట్టంబులు కప్పురపుఁగ్రోవులు లేటికొదమలు పొట్టేళ్ళు పంచవర్ణములచిలుకలు గోరవంకలు మయూరంబులు పావురంబులు డేగలు పికిళులు బచ్చికోళ్ళు రుద్రవీణియలు స్వరమండలంబులు తంబురలు కిన్నెరలు రావణహస్తంబులు రబాబులు మీటుసురతానులు కామాక్షులు ముఖవీణెలు పిల్లఁగ్రోవులు దండెలు ఢక్కీలు చంద్రవలయంబులు రతనంపుతంబిగలుఁ గుందనపుబిందియలు పైఁడికొప్పెరలు వెండికొప్పెరలు వెండిదివెగంబంబులు లుడుగలదిండ్లును సంచపురేకుబాగాల దంతపుబరణులును మఱియు వినోదోచితంబు