పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ. శృంగారరసము మూర్తీభవించినయట్ల
యతసీలతాంతదేహంబు దనరఁ
గరుణారసంబు సాక్షాత్కరించినరీతిఁ
గనుఁగొనలను రాగగరిమ మొనర
శాంతరసంబు ప్రసన్నమైన విధాన
నెదఁ గౌస్తుకప్రభ కుదురుకొనఁగ
నద్భుతరసము ప్రత్యక్షమైన కరణిఁ
గటితటిఁ గనకాంశుకంబు చెలఁగ
గీ. గరచతుష్టయవిలసితదరరథాంగ
ఖడ్గసార్ఙ్గముఖాయుధకాంతు లెసఁగ
మొసలివామేలి తమ్మెట్ల మిసిమి బొసఁగఁ
దపసి డెందాన నెలకొన్న తమ్మికంటి. 390

సీ. దేవరపంపున నీవేళ నటకేఁగి
విలసితంబగు నొక్కకొలనుగంటి
నక్కొల నండఁ బెక్కబలలు గొలువంగ
గడునొప్పు నొకరాజకన్యఁ గంటి
నక్కన్యఁ జేరఁగా నరుగుచో నందొక
సకియచేనున్న వేసడము గంటి
నావేసడము మాది యని మిమ్ముఁ గీర్తించి
పలికిన నలరి యా కలువకంటి
గీ. తనదు కూరిమి సఖియచేఁ బనుప డేగఁ
దెచ్చి యాకాంత యిట నొక్కదిక్కునందు
నున్నదని పల్కఁ జిలువరాదిన్నెఱేఁడు
విని ప్రియమ్మునఁ దోడి తెమ్మనుచుఁ బలుక. 391

సర్వలఘువచనము
వ. అపుడు సచివుఁడు గరుడగిరివిభుసముఖమున నునిచిన నుడధిపవదన ముదమున మును వినినది గనుక సరసిజనయన యరిదరవరకర యసురనికరహరణ మునిజనవినుతచరణ తన వచన మొకటి వినుము దయ