పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిలుకు గనుఁగొనల ననుఁ గనుఁగొనుము భవదుపవనమున నొకపురమున కినుఁడయి గగనపతి యనఁగ నొకనృపుఁడు గలఁ డతఁడు తనకు సుతులఁ బడయుటకు బహుదినములు దపములు సలిపిన నతని తపమునకు నతికృపుఁడయి వలిమలసుతమగఁ డెదుట నిలిచి నృపవర యిహపరముల కయిన సుత నొసఁగెద నది యెటు లనిన భుజగనగమున కిరుదల దొరదెసను జిరుతనగరమున జలజసరసిని గమలము నడువ నొక సిసువు దనరెడు నది తనయఁగఁ గయికొని విషధరదరపతికిఁ బరిణయ మొనరుపుమని పలికి చనినతఱిఁ దదనుమతిని ముదితను దొడుక ముదితహృదయుం డయి పొనపొన నచటికిఁ జని దనకు నుడువు శివుని వచనసరణిఁ గమలసరసిని నిలచిన నిసువు నరసి కని కుతుకమునఁ దన తనయఁగ గయికొని సకలవిభవంబు లొనరిచి మఱియు నొకశుభదినమున జలజనిలయ యని యభిదయిడి సుముఖుఁడయి నిలిచిన సమయమున నతనితనయ దినదిన మధికముగఁ బెరిగినదయి వయసు బొడమినదయినతఱి నొకదినమునఁ జెలులఁ యుపవనమునన ననలు దునిమి వెనుక నయముగఁ గొలకుల జలవిహరణ మొనరిచి వెలువడి యచటఁ గనుగలిగి వినయము బ్రియము బెనంగొనఁగ నునుజెఱకువిలునళిగొనయము కఱకఱి గరిగరి గఱవ దురుసున బరుపుట కొరవుగను గఱకుటరవిరిశరములు శుకపికనికరముఖబలములు గలిగిన మదనుని గని గొలిచి తనకుఁ జిలువమలదొరను మగనిగ నొనరుపుమని మదినిఁ దలఁచు నవసరమున జతనమున మిముఁ గొలుచు సచివుఁడు పులుఁగును వెదకికొనుచు మముఁ గని పొనపొన గినిసి బహువిధముల మిముఁ బొగడిన విని యపుడె చెలువలతల రతనము నెఱతనముఁ దనరిన దొరతనముఁ గలిగిన దవుట నను బిలిచి పులుఁగు నొకచలువ కలువసర మవసరమున నొసఁగి సచివుని వెనుకొని మిముఁ గని యెఱుక పఱపుమని యనిచిన ననిచిన మనమున ననుచు వనిత పనుపున నిచటికి నడచితిని ననుఁ గనకపుసర మనుదు రని హరిపదములకు నొరఁగి తెలియఁ బలికి పులుఁగును గలువసరమును నొసంగి యచటికి కలికి చెలువము బొగఁడగ నలువకు నలవి యగునె యయిన నెఱిఁగిన తెఱఁగునఁ దెలియఁ బలికెద. 392