పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

xviii

“ఈ గ్రంథమునందు గర్భ చిత్రకవిత్వము విశేషముగ వ్రాయబడి యున్నది. ఆంధ్రగ్రంథములలో నీ కవిత్వసంబంధమగు పద్యము లనేకములు వ్రాయఁబడియున్నవిగాని వానిక న్నింటికి లక్షణమెచ్చటను గానఁబడదు. కావ్యాలంకార చూడామణియందుఁ గొన్ని బంధములకు లక్షణము వ్రాయఁబడి యున్నది. ఈ గ్రంథమిప్పటికి[1] నముద్రితమగుటచే దీనియందలి విషయములు లోకమున కందనిమ్రానిపండ్లై యున్న యవి. ఇఁక ముద్రింపఁబడియుండు నరస భూపాలీయమునందై నను నాలవ యాశ్వాసమునందు “అష్టదళపద్మ బంధ చక్రబంధములకుఁ దప్పఁ దక్కిన బంధములకు లక్షణమెచ్చటను గనుపడదు. ఈ ప్రబంధరాజమునందు బంధములన్నియు నరువదికి మించి (60) యున్న యవి. ఈ బంధములనన్నిటిని యీకవి వానివాని స్వస్వరూపములతో, లిఖించియున్నాఁడు. అయ్యవి ముందు బ్రకటింపఁ బడు....... మనుచరిత్ర యందు అల్లసాని పెద్దనగారు గద్యమునందు “చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్య పుత్ర పెద్దనార్యప్రణీతము” అనియు, వసుచరిత్రమునందు రామరాజభూషణకవి “సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధ కవితా నిర్వాహక సాహిత్యరసపోషణ రామరాజ భూషణ ప్రణీతము' అనియు వ్రాసికొన్నారేగాని వారు వారివారి గ్రంథములందొక రైనను 'బంధకవిత్వ గర్భకవిత్వములను గూర్చి యొక పద్యమైనను వ్రాసియుండరైరి. ఇందుకుఁ గారణము విచారించుకొనునది."

ఇదంతయు దాదాపు 85 సంవత్సరముల క్రింది పండితాభిప్రాయము. ఆంధ్రవాఙ్మయ చరిత్రకారులెవ్వరును ఆంధ్రవాఙ్మయ పరిణామమును గుఱించి గాని, అందులో చిత్రబంధ కవిత్వాదుల చరిత్రలను గుఱించిగాని నేటివఱకును వ్రాయలేదు. ఒక్క వంగూరి సుబ్బారావుగారు 1920 ప్రాంతములలో కొంత ప్రయత్నించిరిగాని తర్వాత వారు, శ్రీ వీరేశలింగము పంతులు వారిని గూర్చి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు చెప్పినట్లు, 'తెలుఁగుకవుల జాతకములనే వ్రాసిరి. కవివెనుక కవి, ఆయా కవుల గ్రంథములనే జాపితాలుగా వ్రాయిం చుటయేగాని భావములలో మార్పు, ఆంధ్రవాఙ్మయములో రచనా ప్రక్రియలలో

  1. కావ్యాలంకార చూడామణి నాటికి ముద్రణము కాలేదు. ఆ సంవత్సరమే 1892లో మా తాతగారు మొదటి ఏడుల్లాసములు దొరకఁగా ముద్రించిరి. తర్వాతిరెండుల్లాసములను నేను 1930లో చేర్చితిని.