పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

109

 

    యందరలపై జిల్కిపట్టుగ | నాడి సఖియకు బ్రియము పుట్టగ
    నోల యాచిగురాకుఁబోణికి | నోల యాయంబురుహపాణికి
    నోల యాయలినీలవేణికి | నోల యీమదకీరవాణికి
    నోల జక్కవబాల కిప్పుడు | నోల తామరగోల కిప్పుడు
    నోల తుమ్మెదనారిమీఁదను | నోల యం చయొయారిమీఁదను
    నోల యాకసవిభుని నందన | నోల యోషాకలితచందన
    యనిన సతు లందఱును భళియో | యతివ నేర్పరివని రయంబున
    వనరుహాకరసీమ సుద్దులు | వరుసనిడిన యనంతరంబున. 263

ఉత్ప్రేక్షాలంకారము


చ. అలయక వెన్కయీత నొక యంబురుహానన క్రీడ సల్పుచో
    వలిపెపు పైటమాటునను వట్రువచన్మొన లొప్పెఁగాంతి తా
    వలపు బ్రవాళవల్లికల వ్రాలిన కోకయుగంబు మారుచే
    వలబడి ముక్కులెత్తుకొను వైఖరి జూడఁ జెలంగెఁ జిత్రమై. 264

ముద్రాలంకారము


వనమయూరము. చండగతి పెన్నెఱులు జాజి కటిసీమన్
    మెండుకొని గప్ప కడుమీఱి జలకేళిన్
    దాండవము సల్పెడు విధంబునను నీటై
    యుండి రబల ల్వనమయూరముల రీతిన్. 265

రూపకాలంకారము


సీ. తళుకు పెన్నెరి ముంగురులు గండుతుమ్మెదల్
             సోగకన్నులు కప్పుచూపు తొగలు
    తరులతల్ మొగములు తగు తెల్లదామరల్
             గబ్బిపాలిండ్లు జక్కవలజోడు
    బడుగులు బెడగు లయ్యరుణాంబుజంబులు
             మీఁగాళ్ళు మేటి తాఁబేటిచాలు
    చేతులు తూండ్లు రాజిల్లు నాభులు సుళ్ళు
             సోలుచూపులు బెళ్కు మీలు గాఁగ