Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

107


గీ. కన్నెగేదఁగి రేకుకై కన్నె వలన
   వలని మచ్చరమేల యేవలన ననుచు
   నోజమై గూడి యవురు పయోజముఖులు
   చయము వేడుక పుష్పాపచయము జేసి. 256

జలక్రీడాభివర్ణనము


ప్రాసభేదము


క. వ్రీడావతులయ్యెడనీ
   లీలం బుష్పాచయ కలిత ఘనకేళీ
   లాలిత జనితశ్రములై
   యాలో జలకేళి కాంక్ష నటు చననెదుటన్. 257

క. అంభోజోత్పల కైరవ
   భంభరకలహంస చక్రబక వివిధరవా
   రంభవిజృంభణసంభ్రమ
   గంభీరంబైన కొలను గనుఁగొని యచటన్. 258

మాధుర్యము


క. నారీమణులయ్యెడదమ
   సారపు మణిభూషణములు సడలించు నెడన్
   గారా కెడలిన లతలన
   తీరై కనుపట్టి రధికతేజం బలరన్. 259

క. అక్కొలను జేరి దిగునెడ
   చక్కఁగ సౌపానములను జాఱి యహ యో
   యక్క యిది యెంత జర్కని
   యొక్కసఖియ తనదుచెంత యూతఁగ నిల్చెన్. 260

క. నీకును నాకును జోడ
   ల్లా కిన్నెరకంఠికామృగాక్షికి సరియౌ
   నాకొమ్మకు దానికి సా
   టికలికికి నుద్ది యల్ల యింతి యటంచున్. 261