104
ప్రబంధరాజ వేంకటేశ్వర
యెదల పొదలు పయ్యెదలును జాఱఁగ
మెదలు చూపు తుమ్మెదలటు జేరఁగ
బలువిడి జిగిగుబ్బలు జిగి దేరఁగఁ
దలతలమను వార్తలు ముదమారఁగ
నలువుమీఱ వేనలు లలరింపుచుఁ
గులుకు నడల బెళ్కులు గన్పించుచుఁ
బలుకుల కపురఁపు బలుకులు నింపుచుఁ
జెలరేఁగుచు కుచ్చెలల బిగింపుచుఁ
బకపకనగి చంపకముల కరుగుచు
శుకములె గరకింశుకములు దిరుగుచు
బరుపపు ననకాపరువని దిరుగుచు
గురువిందలపొద గురువని మఱుఁగుచు
నిమ్మరువము దన కిమ్మనువారును
రమ్మదె కర్పూరమ్మను వారును
సహకారమ్ములు సహకారమ్ములు
మహిళకుఁ బ్రియమీ మహిసుఫలమ్ములు
నారికెడంబులు నారికెడంబులు
వేరులుంచ కుర్వేరువటంబులు
పొన్నదేని దా పొన్నకు డాయకు
సన్నజాజికై సన్నలు చేయకు
నలగని సురపొన్నల చే నదుమకు
చులకనగా మంజుళకము జిదుమకు
యీకుందము చెలి కీకుందము నిలు
మాకందంబులు మాకందంబులు
కదలి చూతమీ కాదలివికాసము
పొదల గంటె పూపొదల విలాసము
వెదకు మిపుడు క్రొవ్వెదకును మల్లెలు
మెదలెనిందు తుమ్మెదలకుఁ బిల్లలు
మరల గంటితామరల కొలంకుల
సరులనెతగవా గురులు కెలంకుల