పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

103

క. ఆసవములు చవిగ్రోలెడి
   యాసవసవ లెఱిఁగి తేటులలరులగమిపై
   యాసవదలి పొదలికదలి
   యాసవరన గాంచి చెంత నాడర యమునన్. 250

దశదోహదయుక్త కందము


క. పలుక కొరవి గోగిడ వా
   విలి మూర్కొన్న పొన్నఁదన్నఁ బ్రేంకణము మి పా
   టలఁ గ్రోవినగ చనుపకము
   తిలకముగన మావినంటఁ దెగడన్ బొగడన్. 251

వ. పువ్వుఁజేసి యవ్వారుఁబోడుల వెండియు.

సీ. తిలకంబుఁ నొకతె చూపులసన్న గావించెఁ
              జాంపేయ తరువోర్తు జంకజేసె
    గోగు నొండొకతె యెగ్గులు బల్కుచును దూరె
              గడుఁజేరి యొకతె ప్రేంకణమువాడె
    నొకతె డాయుచుఁ గురవకము గౌఁగిటఁ జేర్చె
              వకుళంబుపై మించ నొకతె యుమిసె
    ఱేమావి చేనంటి ప్రేమనొక్కతె యూఁచె
              నొకతె వావిలిమఁద నూర్పు లొసఁగె

గీ. గడిమి నొకతె పొన్నఁ గనికి కాకిక నవ్వెఁ
    బ్రకటముగ నశోకమొకతె తన్నె
    నిట్లు పానవశతనింతులు మెలఁగ నా
    తరులు సరచి విరులఁ దనరెనంత. 252

వనకేళి మధురగతిరగడ


    సారసవదనలు సారపదమ్మున
    గారవముగ శృంగారవనమ్మున
    తములెచ్చిన చిత్తములను వేడుక
    గములైతగు పూగములను గూడుక