పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాకరా వెన్నెలగుత్తి కన్దోయి మన్నీఁడ తీవంచ మిన్కుల దొంగ నడంచిన సామీ పున్నెంపుప్రోదియై చూపట్టు తిరుపతి ప్రోలునేలు రామిమ్మ మబ్బుపూవిడుపు నిద్దాకప్పు కప్పు నెమ్మేనికాఁడ పాలసంద్రంపు బిడారంపు దేవర కన్నులీకలతమిన్న నాయక పులుగు సాహేబు బాబారాయఁడ మొసలివాయొంటుల నాయఁడ బూరగొమ్ముగల తుపాసి జాలువాసాలు తాలుపు జియ్య మోదుగ మొగ్గనిగ్గు చొక్కాటంపు ముక్కుమిటారంపు పటాని నెక్కువాని నెక్కు తండ్రి పొలదిండి గొంగదొర యుంగుటంబునజాలు గన్నయ్య కఱివేల్ప ముక్కంటి పండుల మెక్కు మొక్కళిని గన్న ముక్కంటి పొగడిక నమరిన ప్రోడ వ్రేతల యీలువులు కొల్లలాడిన నెఱవాది చాగపు మ్రాన్మ్రుచ్చిలించిన గంట రెంటత్రావుడు మొరాలించిన దిట్ట కఱ్ఱినేస్తి తరిమల మోపరి తమ్మికంటి కయ్యపుటోగిరంపు టయగారి పాట వినుజాణ జడదారి డెందంబు నెలవరి పదినూఱుపేరుల దిరుగు జేజే కలుగు లాయంపు టెకిరింత నెఱరౌతు గన్న దేవర నెలంత కొమరు మామడాచిన రతనంపుగని కొడుకు బోనంపుగుంపు వజీరు నీటికందుపాపని పినతండ్రి మూకల సూడు పొలదిండిరాయని పట్టి దురము బన్ను నెలవు పెనురాయనిసువుబంటు పాదుషా పదియాఱువేల నూట యెనమండ్రు జవరాండ్ర నేలిన మాయదారి యలివేలు మంగమఱేఁడ బారుదుగ జగములానిన బొజ్జగలాఁడ చేవంచదుగకొండల కాణాచి కాఁడా. 216

అచ్చతెనుఁగు పంచరత్నసీసములు
1సీ. కలిమివాల్గంటితోఁ జెలిమిచేయని మేలు
జులిమి వావిరి జూపు బలిమివాఁడ
మెడద వాటిలు కిత్తు వెడదవావడి గ్రోలి
బెడదవాపెడు గొప్ప యెడదవాఁడ
పులుఁగువార్వము నూని యలుగు వారల జెండ
గలుగు వాటంపు చుట్టలుగువాఁడ
కరమువాదిడు మామ యురము వాలించు మొ
క్కరము వారని మేలికరము వాఁడ