పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ. మెకము వాకట్టు వెలిబూది మేళవించి
కరిమదం బంగములయందు గలయ నలది
నీటు మెఱయంగ నందంద నిలిచి మ్రొక్కి
కొమరు చెంచెత నాసామి కొమరు గాంచి. 211

సారాలంకారానుప్రాణితైకావళ్యలంకారము
క. గిరికలు కిరులను మించును
కిరుల శరీరముల బోలు కెరలెడుకరులున్
గరుల పొడవు లున్నతములు
గిరుల గడవ గిరులు మిన్ను గెంటించు హరీ. 212

అలంకారకృతవస్తుధ్వని
గీ. సామినీయసపు చెలికి చందుమొకము
చుక్కచాల్ గోళ్ళు వెండి మంచు మలలు జిగి
దొరయు గుబ్బలు తెల్లతామరల తళుకు
కలుకు నిడువాలుగన్నులు దలఁచి చూడ. 213

అంత్యచరణయతిభేదయేకాక్షరకందము
క. కైకోకీకా కెకుకై
కోకాకా కింకకూకి కూకకు కోకీ
కాకుకకు కేకికేకిక
కూకోకొక్కూకకింకకో కైకౌకా. 214

విస్మయము
క. హరినీదు ప్రతాపాతప
మరరే బ్రహ్మాండకర్పరావృత మగుటన్
బరులు వడకుదురు గొడుగులు
తిరసకర్తింపుదురు గంట తిమిరము గప్పన్. 215

దేశ్యపు తెనుఁగు వచనము
వ. కంటి విన్కలి దంట పేరింటి గుంటి యెకిమీఁద యీరైదు తూపుల నెసఁగు దునేదారీ తెల్లదీవిరాజ సుడివాలుకేలున దనరిన యొడయ