90
ప్రబంధరాజ వేంకటేశ్వర
స్ఫుటమయి దుటమయి కడునా
వటమయి బటువయిన దొక్కవటముం గనియెన్. 207
చ. కనునెడ మంత్రియో సురశిఖామణి చూచితె యెంతవింత యీ
జననుత భోగికంకణత సద్విజరాజ సమాశ్రయత్వమున్
ఘనతరజూట భాసురత గన్గొన నప్రసవాయుధారి యో
యనఁ జెలువొందె నివ్వట మహర్నిశ మంచు విలాసవైఖరిన్. 208
గీ. పలుకు నమ్మంత్రి కూడుక ఫణిగిరీశుఁ
డత్తరుచ్ఛాయ కలరు నెయ్యంబు మీఱ
వచ్చి శ్రమమార్ప నొకకొంతవడి ప్రియంబు
వెలయఁగా విశ్రమించిన వేళయందు. 209
సీ. వెన్కజిక్కిన మెకంబును దెచ్చి తలనీట
దడిపి పువ్వులు సుగంధంబువేసి
కొనతోక తెగగోసి మునిమీసలు పెకల్చి
కానుకజేసి కాట్రేని గొలిచి
క్రొవ్వని పందుల కొన్నిటిగ మలిచి
కత్తిఱాలను చివ్వి కౌచిగడిగి
తాలిచి కఱుకుట్లు గాలిచి యుప్పును
మిరియంపు పులుసును మేళవించి
గీ. చలువగల మఱ్ఱి తొఱ్ఱ క్రీచట్టుమీఁద
నిలువ నందఱితోఁ గూడ పొలుసుమెసవి
కోరకైదువదునెదారి గుఱుతుగట్టి
సామి సంతోషముననున్న సమయమునను. 210
సీ. తొగరు జుంజురుకులు తొలఁగదిద్దిన గొప్ప
కొప్పుల నెమలీక లొప్పజెరివి
సొగసుగా నుదుట కస్తూరి నామములు దీర్చి
పొసఁగ జేగురుచుక్క బొట్లువెట్టి
పాఱుటాకు చిగుళ్ళ పయ్యెదల్ సవరించి
యురమున గురిగింజ సరులమర్చి
సరిగణ్పు పండువెదురు వీఁకగల విండ్లు
లెక్కించి చిలుకమ్ము లేర్చిపట్టి