పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బులును, లేవెలుంగు మినుగు శకలకు గాక చలుఱాతి పడగల రంజిల్లు బిల్లులు బెల్లుగాబట్టి గరగరఁగొరికి బిరుసులేని నునుగఱ్ఱల నెఱ్ఱగా జవ్వాది యొత్తి యెమ్మెరం ద్రిమ్మరు జవ్వాదిపిల్లులును పిల్లల నక్కునందు నెక్కొననిల్పి నిక్కుగల కొమ్మలనెక్కి పచేళిమంబులైన క్రొమ్మావిపండ్లు మెక్కి గ్రక్కున నిక్కడక్కడ దాఁటుచు నందునిందు మాటుచు నిక్కినిక్కి వెక్కిరించుచు చెవులు రిక్కరింపుచు పండ్లిగిలింపుచు గండ్ల బెదిరింపుచు కిలకిలారావంబులు నింపుచ గలగలన చెట్లు గదలించుచు వెనుక ముందఱఁ జూపి మెలఁగుచు పెనఁగులాటలం జెలంగుచు పిక్కటిల్లు మర్కటంబులును గలిగి విలసిల్ల విలోకించి యంత యక్కాంతారంబున నొక్కసెలయేటి కెలన నిలిచి యచ్చిలువమలఱేఁడు శేనంపాత మొదలగు వేఁటలాడుఁడని లుబ్ధుల కానతిచ్చిన. 186

క. పులియెలుగు పొడల చల్లడ
ములు దట్టులు నీలిగోణములు పీకల దం
డలు కావుబొట్లు మెట్లును
కలిగి చెలగునట్టి బోయగమి యవ్వేళన్. 187

క. బలువిండ్లు చిలుకుటమ్ములు
మొలిదట్టులు నీలిగోణములు కురుచపిడె
మ్ములు పీకలు చేకొమ్మలు
నలరఁగ బోయదొరబిడ్డ లాహరి యెదుటన్. 188

ఉ. కొంచెపువాలముల్ గురుచగోళ్ళును గొప్పశిరంబు కాళ్ళమే
ల్మించిన నాల్క డొక్కజిగి మిట్ట యురంబు వెడందకండ్లు మై
పెంచిచెలంగు భీముఁడు తుపాకిలకోరి కరాళిగొంటు క్రొ
మ్మించు తలారిజీడిపులి మేఘమునాఁదగు జాగిలంబులున్. 189

యతి
మ. సెలకట్టెల్ తడువిండ్లు నుర్లుతెరలున్ జేకత్తులున్ చల్లిపా
దులు పందీటెలు దీమముల్ చిలుకులూదుల్ చిక్కముల్ మోటక
త్తులు బోనుల్ బడెగండ్లు ముంగిసలు నెద్దుల్ పొగులున్ బోటుకో
లలు జాలంబులు గంటలున్ దివెలు గాలంబుల్ జిగుర్మీటలున్. 190