xii
ముల నుదహరించి పోతనయొక్క భోగినీ దండకమును ఉదాహరించి యిక్కవి తన గ్రంథముల నన్నిటిని వేంక టేశ్వరస్వామికి నర్పించిన మహాపురుషుండు” అని వ్రాసినారు. వీరి కాలమునకు “చండ విద్యావతీ దండకము' (పుష్పకోదండము) వెలువడలేదుగాన నిట్లు వ్రాసినారు గాని ఇతఁడును భోగినీ దండక రచయిత వలెనే, ఆ ఫక్కిలోనే తన దండకమును వ్రాసిన విషయము శ్రీ ఆరుద్రగారు విశదీకరించినారు. (చూ. సమ. సా. XI 166-7) ఈ కవి ఏ యే గ్రంథములను ఎవరెవరికిచ్చినాఁడో ఆ గ్రంథములు దొరకినగదా తెలియును. రాజాశ్రయము చేయనివాఁడుగాఁడు. వారివలన నెంతో ఐశ్వర్యమును పొందినాడు. పోతన కూడ సర్వజ్ఞ సింగమనాయని ఆశ్రితుఁడే : మనఁకు నాఁటి చరిత్ర చక్కగా తెలియరాలేదు గాని సింగమనాయుఁడు (మూఁడవవాఁడు) తుది దినములలో చాలా బాధలుపడి ఓరుగల్లు తెలంగాణ ప్రాంతములను వదలి గుంటూరుసీమకు వచ్చినట్లున్నాఁడు. ఆతని మరణానంతరమే పోతరాజు భాగ వతమును రచించియుండును. భాగవతాంకితమును గూర్చిన కథలన్నియు పుక్కిడి పురాణములుగా తర్వాతివారు కల్పించి యుందురు. వాస్తవమునకు ‘బాల రసాల' పద్యము మంచన కేయూరబాహు చరిత్రలో (క్రీ శ. 1300), పోతన్న కు దాదాపు రెండువందల యేండ్లకు ముందుండియు కనఁబడుచున్నది. 'ఇమ్మను జేశ్వరాధముల' పద్యము కూడ ఎవరిదో ! కాటుక కంటినీరు' పద్యము కూడ సందేహాస్పదమే. సింగమనాయఁడు కర్ణాటకుఁడా ! పైగా సర్వజ్ఞ బిరుదాంచితుఁడు అట్లు వ్యవహరించునో ? ఈ రాజాంకిత నరాంకితాది విషయకమై పండితులు పరిశోధింప వలయును. త్యాగరాజు వంటివాఁడు మాత్రము కాఁడు. అట్లు చూచిన వీరెవరును కారు.
గణపవరపు వేంకటకవి తన కైశ్వర్యమబ్బిన విధమును స్పష్టీకరించినాఁడుగదా. 'తానోకార్యఖడ్గప్రవీణుడు' కార్యఖడ్గ పటిమధురీణుండును. మంత్రి అనఁగా ఉద్యోగస్తుఁడు, రాజనియోగి. పరంపరగా రాజుల నాశ్రయించు వంశమువాఁడు. పైగా 'కామినీపంచబాణుఁడు' శ్రోత్రియుఁడుగాఁడు. “కర్ణాట తుండీర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిలమహీమండలాఖండలదత్త మత్త సింధుర సైంధవాందోళికా చిరత్న రత్నాంబరాదివస్తు ప్రశస్త మందిరుఁడు.” మఱి వారినిగుఱించి ఒక మంచిమాటయైనను చెప్పక ‘ఇమ్మనుజేశ్వరాధములు' ఆని నీతీరున నుండిన త్యాగరాజువంటివానికి ఈ యైశ్వర్యమంతయు ఆ యా రాజులవలన అబ్బునా?. తన యైశ్వర్యానుభవమును ఎంతో గొప్పగా చెప్పు