పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi

ఆంధ్రకౌముది. గణ యతి ప్రాస లక్షణ సీసమాలిక, ఆంధ్రప్రయోగ రత్నాకరము, రేఫజకార నిర్ణయపద్ధతి, షట్ప్రత్యయముల ప్రస్తారసరణి , యిర్వదాఱు ఛందముల వచనము, అలంకార సారము, పరమ భాగవత చరిత్రము, ఆంధ్ర ద్విరూపకోశము కల్పితకల్పలత, తెలుఁగు వసంతతిలక భాణము, కఠినప్రాస శతక రాజము, ఆంధ్రప్రక్రియా కౌముది, జాంబవతీ విలాసమను చిత్రకావ్యము, చండవిద్యావతీదండకరాజము, చక్రతారావళి, పురాణసారమను పేర్లంబరఁగు (25) నిరువదియైదు గ్రంథముల రచియించినట్టును, యిట్టి గ్రంథరచనవలనఁ దన జిహ్వాంచలంబు తనవినొందదను కారణమునఁ గులదేవతావతంసమగు వేంకటేశ్వర చరణారవింద మహిమ నవనవోన్మేష వర్ణనలచేనొప్పు నీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమును రచియించినట్టుగా నవతారికా పద్యముల యందు వ్రాయబడియున్నది. ఇక్కవికృతులలో నొక్క వేంక టేశ్వర నిఘంటువు తప్పఁ దక్కిన గ్రంథములు నామావశిష్టములై యున్నవి. ఈ కవిచే రచియింపఁబడిన గ్రంథజాలమునకై ప్రయత్నించఁగా వేంకటేశ్వర నిఘంటువు మాత్రము లభించినదిగాని తక్కిన ప్రబంధములు 'ప్రాచ్యభాషా లిఖిత గ్రంథ సరస్వతీ భండారము” (ఓరియంటల్ లైబ్రరీ) లోఁ గూడా నేత్రముల కగోచరములై యున్నవి. నేత్రగోచరమైన వేంకటేశ్వర నిఘంటువును జూడఁగా నీ ప్రబంధరాజమున నవతారిక యందలి 49 వ పద్యమునఁ జెప్పియుండు రీతి ‘బిరుదుగద్య' ఆ నిఘంటు కడపట నివ్విధముగా వ్రాయబడియున్నది” అని బిరుదుగద్య, 'ఇది శ్రీమత్పెరుంబూదూరు' ఇత్యాది ఉదాహరించినారు. ఇది ముందే ఇందుదాహృతము..

పై గ్రంథముల గూర్చి ఇంతకన్న నెక్కువ తెలియరాదు. “నన్నయ పెద్దన, యెఱ్ఱన, తిక్కన, వీరన, తిమ్మన, పెద్దనాదులవలె[1] నిక్కవిరాజాశ్రయుండై తన గ్రంథముల నరాంకితములు జేయక నారాయణాంకితములుగాఁ జేసి మనిన ధన్యుండు” అని వ్రాసి 'ఇమ్మనుజేశ్వరాధముల' ‘బాలరసాలసాల' పద్య

  1. పెద్దనలను ఇరువురను పేర్కొనుచున్నారు. శ్రీపూండ్లవారు. వరుసయు వ్యత్యస్తముగా తిక్కనకు ముందు ఎఱ్ఱనను పేర్కొనుచున్నారు. మొదట పెద్దన కావ్యాలంకారచూడామణికారుఁడు ప్రాచీనుఁడను నభిప్రాయము కాఁబోలు వారి కాలమునకు చరిత్ర చక్కగా తెలియదు గదా. కాని ఎఱ్ఱన తిక్కనల పౌర్వాపర్వమో! ఏదో అనాలోచితముగా వ్రాసినారేమో!