78
ప్రబంధరాజవేంకటేశ్వర
గీ. యేము సెప్పిన సుద్దుల యింత గలుగ
దితపుగాఁ బల్కు యీ సోటుకతలదెల్ల
కాన యీకాన నాకెనగాన మేటి
నల్లయెఱుకాన యెఱుకాన నల్లసామి. 163
ఆ. మేముగలుగు పజ్జ మీకొక వేఁట దో
టలను వేడ్కఁ జూపవలయుఁ గాక
నురకయిండ్లకడను నుందుమే మీసొమ్ముఁ
దినిన ఋణముదీర్తు మనుచుఁ బలికి. 164
క. వేయేల జియ్య విన వ
య్యా యిక మా వినప మొకటి యటు కనుఁగొనఁగా
నేయెడఁ జూచిన నడవిలు
లాయంబులు వెలయ జమునిలాయము లనఁగన్. 165
క. ఇనమణి యవిగాకా చెం
తన యెక్కటి రెండుమూఁడు నాల్గయిదాఱే
డెనిమిది పదియుఁ బ
దనకొండ్బండ్రెండు గాఁగ దగ నేర్పడుచున్.166
జాతివార్త
సీ. కోనము న్వెలువడి ముర్ఘురధ్వనులతో
దారిముస్తెలు మోర లోరసిలగ
నేల జల్లెడువలె నెలకొల్పి పొలమెల్ల
పోడు గొట్టిరన గోరాడి చప్ప
రింపుచు పైవేరు దెంపుల దంట్రలు
నూరిజాల్సెలవుల నురుగు బిరుదు
జల్లులగతినొప్ప దుళ్ళుచు నవ్వాడి
కోఱల నరవాడుదేరు చీఁక
గీ. దిగుబురుత్తరింపుచు వెదురుగడలువడ
రాచి తుదలెల్ల ఝాడించి రాలుబియ్య
మెరకుగొని పెంట్ల గూడిమై నెరులు నిక్క
నేన్గు దోమగఁ జూచు న య్యేకలములు. 167