పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క. ఇది పొల మిది బిల మిది చే
నిది బై రిది కుంజ పుంజ మిది చె
ట్టిది ఝరి యిది దరియని తెలి
యదు మెకములు నేలయీనినటుల మెలంగున్. 168

క. కైవాలుపండు పంటల
కైవాలు మెకమ్ములామి కైవాలుటచో
నీవాలున నీవాలున
నీవాలున నీ ప్రశస్తి నెఱపఁగవలయున్. 169

ఆదియమకము
క. బలుబంది పందికదుపులు
పులు లెలుఁగులు సిలుగు చిఱుత లేనుఁగులున్
గలయడవుల గలకొలఁదుల
దులదుల వేటాడగాక దులవలయు హరీ. 170

ఆద్యంతైకనియమ ఛేకానుప్రాస యమకరూపకందము
క. నేనిక నేనికయౌదల
మానిక మానికరమైన మానికడెంబుల్
పూనిక పూని కరంబుల
కానిక గానికగ నిచ్చుఁ గానిక యిత్తున్. 171

ఉ. రమ్ము మురారి నిన్ను సుకరమ్ముగఁ దోకొనిపోయి నేడు నా
యమ్ములచేత జంతునిచయమ్ముల నెల్ల వధించి మావినో
దమ్ములు చూపి నీమది ముద మ్మలరింతును నాదుజోడు లో
కమ్ములయందు సెంచుకులకమ్ముల గానము సాము సత్తునన్. 172

క. ఇడుములబడి మెకములవలె
యడవులను జరించునట్టి యదము లటంచున్
గడు చుల్కజాడకే మె
ప్పుడును పురండములు విన్న ప్రోడల మనుచున్. 173