పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గందపుఁగట్టు దుర్గపుఠాణములనెల్ల
పట్టుగా మాసిన పాపఁడేలు
బొడుపుకొండకు సెల్లుబడి కోనలవి యెల్ల
కొమరు మీఱంగ నాకొమరుఁ డేలుఁ
గర్వంపు వెంబడి బంగరు గ్రంకు మలలెల్ల
దేవరబంటు సాధించి యేలు
గీ. నిండె కొంచెపు నక్రమయీదరములు
మత్తు బొత్తిల్లు తనకేలుసత్తి దనర
నాదు పినమన్మఁ డేలల్ల నాటనుండి
చిలువమలవాఁడయో రాచకలువఱేఁడ. 161

సీ. డంబెచ్చు తపసికన్నుంబాప పేరెక్కు
నందలి కుందేటి కందు నొకటి
చాయజక్కవ చంటి సాహేబు పాపని
తురకమానికమగు దుంత యొకటి
ముక్కంటి పండుల మ్రొక్కు లీడేర్చు నా
యంకుని తండ్రి చేసింక యొకటి
జాళువా పరపయ్య జంపి యీపట్టికి
మేలిచ్చు సామేని మెకము నొకటి
గీ. నీటియెకిమీని మొలనూలు బోటిమిన్న
నొంటిపంటనుగల కిటి యొకటి నిక్క
కలను నెమకిన మెకముల పొలపుఁగాన
మేము జేజేల గాచిన సామిసంద. 162

సీ. మా వేటలకుఁ దప్పి వేవచ్చినదిగదా
మెలఁగెడి యీనేల మెకములెల్ల
మాసెలవిడి పారవేసిన యదిగదా
యిమ్మైన యీయేన్గుకొమ్ములెల్ల
మేమువాసవి సూడ మిగిలిన యదిగదా
యీనెలవున దెచ్చు తేనెలెల్ల
తొలుత మాపోగు కట్టల రాలినదిగదా
యిందు గల్గిన హరిబీకలెల్ల