విజయవిలాసము
73
గీ. కవుర భువనాతిశాయి వైభవ విభూతి
బూని సుజ్ఞానజేగీయమానుఁడ వయి
పిట్టగమి పాదుశాబాసుగట్టు మీఁద
నెలకొనఁగ మెల్చి దేవర వెలసియుండ. 146
జాత్యభావ ఫలోత్ప్రేక్ష
క. తగవరు లిలలో వెలఁదులఁ
దెగటార్పరు గాన మిమ్ము ఢీకొను పగరల్
దిగవిడుతు రనుచుఁగాదా
వగభీరువులైరి లచ్చి వలపులరాజా. 147
గుణితాసాధారణా నుపమాన కందము
క. గడిగాటపు గిరిగీముల
గుడిగూబల గెబ్బుగైత గొల్లలు గౌలన్
దడలుచు గండరిగర్వము
విడుతురు నీరిపులు జేరి వేంకటశౌరీ. 148
అనుపాత్తవాచకధర్మోపమానలుప్త వృత్తీప్రాససీసము
సీ. ఇటు గిబ్బతేజి యెక్కటిరౌతు చేపట్టు
గరితగాంచిన గట్టుగాంచినాఁడ
నిటు జోడువీడని బటువు పుల్గుటనుంగు
చుట్టపుట్టువు మెట్టుఁ జూచినాఁడ
నిటు నండుటేటిపాలిటి కలంకులు దీర్చు
గేస్తు గుబ్బలిఁ దిలకించినాఁడ
నిటు వల్లెతాటి మిక్కుటపు టెక్కురికీబు
కెడగొప్పతిప్ప వీక్షించినాఁడ
గీ. జియ్య యేమందుఁ గొదనాల్గు చెఱఁగులందుఁ
దిరిగి కనుఁగొననెందు దేవరకు దొరయు
పురుడు నేగాన నీబంబుబురుకగాన
చామనమెఱుంగు తిరుమేని సామిగాన. 149