Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ప్రబంధరాజవేంకటేశ్వర


ఉపాత్తక్రియానిమిత్త జాతిభావ స్వరూపోత్ప్రేక్ష



క. ధరణిభరణదీక్షకు వా
   విరిఁ బూనిన గెలుపు లచ్చి వేనలి లీలన్
   బరఁగు కరాళభవచ్చుభ
   కరనందన మబ్ధికన్యకా చిత్తేశా. 142

ముద్రాలంకారరూపార్ణవదండకము



   కలితభువనయోగ జీమూత గోత్రావళీ శాత్ర వాశ్మద్యుతిచ్ఛేద నోద్ధామ
   ధామాభిరామకృతీ, విలసితమునిభావ షట్కోణపంకేరుహాంతస్థ సత్కర్ణికాపార
   సంచారి భృంగానుకారీస్థితీ, ఘనవిపిన సరోంబుపాన ప్రభిన్నాగ్ర
   పాదస్ఫుఠ ద్గ్రాహకగ్రాహ మస్తాగ్ర భిద్భీమ చక్రాయుధా, వినుత
   జనదురంత సంసార ఘోరార్ణవోత్తారణాకారణాభూతనౌకా ప్రతీకాశనైకాభిదా. 143

ఆర్యాగీతి రూప కందము



క. వ్యాళాధిప నగనాయక
   నీలధారాధారినేత నేడజకులరాట్
   శైల పశ్వేతక్ష్మ భృ
   త్పాలా వృషభగిరినాథ ధరరాజవరా. 144

అభేదభేదాతిశయోక్తి - అపూర్వప్రయోగము



క. ఈతేజోనిధి కర్హమ
   రాతిరి సత్కాంతఁ జెందరామి యనుచు ఖ
   ద్యోతు రెయి సరుచి జేయు వి
   ధాత కరింగడచి నీప్రతాపము శౌరీ. 145

ధ్వని


సీ. తలయెత్తుటకుఁ గల్గెఁ దనజాతివారిలో
             దెలి వేయిపడగల చిలువసామి
    కనయంబు చాయపొం దొనరింపఁగాఁ గల్గె
             గటికిచీఁకటి పాఱ గదుము ఱేని
    కలరు విల్తునిదాయ యౌదల నిలఁగల్గె
             జల్లని వెల్గు లేజందమామ
    కలదచ్చి దెసల కొండలు నిల్కడగల్గె
             నింగినంటకయున్న నీటిదారి