66
ప్రబంధరాజవేంకటేశ్వర
కుధరశంబంబు దీధితి మధిత మృదుల
పక్వబింబంబు తపన బింబంబువొడమె. 119
క. తొలిమల గుహయను గొలిమిని
గలితోదయ సమయలోహకారుఁడు రాగా
నలమునను గాచి యెత్తిన
బలులోహపుముద్ద యనఁగ భానుఁడు దోచెన్. 120
ఉపమాలంకారము
ఉ. ఆవనజాప్తుఁ డద్రిపయి నంబుధి స్వప్రతిబింబముం దగన్
గేవలమైన యద్భుతము గీల్కొను చక్రయుగంబుగా మయూ
ఖావళిసూత్రసంహతి యుగాభువిబాంధుల మేలుతూరుపన్
జావిలి దెల్పుఢక్కయను చాడ్పున నొప్పె విచిత్రభంగియై. 121
ఉత్ప్రేక్షాలంకారము
మ. జగదాశాబహుదైన్య వారణవిరాజదీక్షణాన్వీతయౌ
గగనశ్రీ కిరుచక్కి ప్రాగపరదిగ్రావద్విపద్వంద్వహ
స్తగతాంచద్వసురౌప్యకుంభములు నా సంధిల్లె సత్కాంతులన్
మిగులన్ సూర్యసుధాంశుబింబములు నెమ్మిన్ దద్దిశాంతంబులన్. 122
రూపకానుప్రాణితోత్ప్రేక్షాలంకారము
తే. పూర్వశైలస్తనగములఁ బుష్పవంత
బింబములువొల్చె సమముగా నంబరమునఁ
గాంచనాబరధరు కరాగ్రములయందు
నమరియుండెడి శంఖ చక్రము లనంగ. 123
అపూర్వప్రయోగము
సీ. తొలిబల్కు చెలులాడు తలిరాకుటుయ్యెలఁ
గూర్చిన పవడంపుగొలుసు లనఁగఁ
బ్రాచీదిశాలక్ష్మి పట్టుమేలిమితామ
రను మించు పత్రము లనంగ