పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

65


యతిభేదము



క. గ్రావవసదుఊఊ ౩ ఇ
   త్యేవంకాలాచ్క్రమలఘుదీర్ఘప్లుతస
   ద్భావజ్ఞాంఘ్య్రాయుధసం
   భావోదాత్తానుదాత్తా మధ్యమరవముల్. 116

వ. వెలయుఁ దత్ప్రదేశంబున.

    

అను ప్రాసవర్ణనివృత్తి యమకవృత్తము


ఉ. జాతి తొగల్ నలంగ జలజాతములెల్లఁ జెలంగ బాంథులన్
    భీతి తొలంగఁబైట నళిబృందము లుప్పతిలంగ నెమ్మిసం
    గాతిగలంగఁబుప్పొడులు కంతుని పావడలైవెలుంగఁ బ్రా
    భాతదిశన్ మెలంగె ననపాయ బలాతత వాతపోతముల్. 117

చ. భవనములందుఁ దమ్ము వసుభారమునన్ వెలయంగఁజేయు రే
    కువలయనేత్రకార్శ్యమునకున్ దగ విన్నదనంబు నొందెనా
    సవసవ దీపపంక్తులు వెసన్ దెలుపెక్కెఁ దలంప మిత్రులం
    దవిలినయార్తి డెందములఁ దాల్పరె స్నేహ దశాను వర్తనుల్. 118

సూర్యోదయవర్ణనము


బహువిధోల్లేఖాలంకారము


సీ. జేజేల సభను రంజిలు వెలిమావు వె
              డఁ దపికి ల్పూతలాటం బనంగఁ
    దూరపు వెలఁది నిద్దురఁ బోవునట్టి వి
              న్పాన్పుపైఁ గెంబట్టు బటు వనంగ
    సాముసేయుచును వాసవియెత్తు వలకేలి
              కడిఁది మానికపుసంగడ మనంగఁ
    గడిలిరాజు హరికిఁ గైగాన్క నిచ్చిన
              బటువు క్రొంబగడాల బంతియనఁగఁ

గీ. బాలితాంభోరుహ నికురుంబంబు ముదిత
    నిఖిలలోక కుటుంబంబు నిబిడతమిర