పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

67

    
    రాజుపై నెత్తిన ప్రత్యూషనృపుతోఁపు
            దళుకొత్తుఁ దేరీజత్రాడు లనఁగఁ
    దూరుపుగుబ్బలిదొర చెంతఁ జేర్చిన
            సూరెపుటపుటల్లి జొంపము లన

తే. నగ్రజన్మకరాబ్జ దత్తార్ఘతోయ
    నిశిత నారాచదళితమందేహ దేహ
    దారుణ స్రవదస్రోరుధార లనఁగ
    నవ్యఖద్యోతకాంతులు నభముఁ బ్రాఁకె. 124

చ. జలరుహమిత్రుఁ డయ్యుదయశైలముపై నటదోచుఁ గంటెముం
    గలసమయోచితజ్ఞ పటుగాయక మంగళగీతికాచయ
    మ్ములు తనునిద్రమేల్కొలుపఁబొల్పుగ మేల్కొని నిత్యకృత్యముల్
    వెలయఁగఁ దేర్చి శారినృపవేషముఁ బూనక రాజసంబునన్. 125

తెనుఁగు సమాసము



మ. నెలఱాతీనియ సంతసంపుమగఱా నీరాళపుంగొప్పటా
    కులనిద్దంపు బసిండి నున్జవికె నిగ్గుల్ దొట్టుకట్టాణిపూ
    సల మేల్బొబ్బ మెకంబు చెక్కడపు కీల్ జాగాజగాగద్దియన్
    జెలువెచ్చ న్గొలువుండె నెల్లరులు జేజే యంచుఁ దన్గొల్వఁగన్. 126

వ. అట్టిపట్టున.

స్వభావోక్త్యలంకార జాతి



సీ. జొత్తు దళ్కొత్తు జుంజురు ముంగురులు కోర
           శిఖలపై తలముళ్ళు చేరఁజుట్టి
    వనమృగంబులు జేర ననువైన మొగసిరి
           తిలకము ల్ఫాలసీమల నమర్చి
    ముంజేతవాకట్టు మూలిక ల్గట్టిన
           పులుగుపూసలు చాల నలువరించి
    కరదండమధ్యభాగమ్ముల గురుగింజ

           పట్టియల్ నీటుగాఁ బరిఢవించి