పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రబంధరాజ వేంకటేశ్వర

గీ. యొరపుగాఁ దీగె మెరుపాని మెఱయుకరణి
కోపు పొదలిక విడుదల కోపుదీఱి
తమ్మి చిరవలిగదలు విధాన మే నొ
కింత యిటునటు బళికించి యంతమఱియు. 109

సీ. కయ్యడ కట్టిన క్రమములు వినుపించి
దేశి శుద్ధాంగముల్ దేటపఱచి
తొలుత సూళాదుల కొలవణి మెప్పించి
జక్కిణిగతుల నొసంగులంది
మండల నృత్తమసంభ్రమసంగతులు జూపి
చిందుల నంద మందంద నెరపి
తిరువుల లాగుల తరితీపు గల్పించి
దళచంచు గతుల బిత్తరము మెరసి
గీ. దండపాద వినోదా వధాన కరణి
విభ్రమములన నాయాసవిధము దాల్చి
మాయురే యన నాడె రంభా తిలోత్త
మాఘృతాచి ముఖుల కవమాన మొదవ. 110

అపూర్వప్రయోగము
క. ఏణీలోచన యీగతి
నాణెముగా నాడునట్టి నాట్యం బార్త
త్రాణపరాయణుఁ డటు గని
పోణిమి బహుమాన మొసఁగి పుత్తెంచి వడిన్. 111

వ. అంత నేకాంతంబున కాంతంబుగా మోహినీరూపవంచమానాపంచశరుండును, సప్తసాలభేదనచణశరుండును, విహంగేశయానుండును, భుజంగశయానుండును, మహాభ్యుదయుండును, సదయుండును, సారసోదరుండును, సాదరండును, యర్చితోమాధవుండును, భక్తజనవ్రాతచూతమాధవుండును, గుణుండును, నిర్గుణుండును నైనవందారు మందారుండు తిరుపనిపిళ్ళలు పొందళిహల నమర్చి తెచ్చిన బంగారుతీఁగ విప్పపూరాజనాలు