పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

63

పుష్పమంజరులు కస్తూరినగరాలు ముత్తెసరు లేనుఁగ కొమ్ములు గంగాజలములు కేసరులు చంద్రవంకలు వెన్నముద్దలు దాళువాలు నారళ్ళు రామబాణాలు కటకసరులు రత్నసరులు జీనిసరులు రాయసరులు పచ్చ దినసరులు గంధసరులు మద్దిగండ్రలు రేఖాములు కాంభోదులు మదనసరులు జలమబుడతలు వెలవడాలు మల్లెశ్రీగంధులు కుసుమపూ రాజనాలు కృష్ణనీలాలు ముద్దుఁబ్రాలు కస్తూరిపట్టెలు చెన్నుగులు శ్రీరంగాలు చింతపూలు గోరోజనాలు సన్నెమణ్ణంగులు జీఱకఱబ్రోలు పోతుగంట రాజనాలు సీతాభోగాలు గౌరీకుంకుమలు నాగమల్లెలు గొబ్బికాయ బలుగుత్తులు రణము బెండ్లికొడుకులు ఈశ్వరప్రియములు యేలకిరాజనాలు పిచ్చికగోళ్ళు వంగాకుబుడుమలు ప్రయాగలు పసుపుగన్నేర్లు గుత్తిబలుగుత్తులు రావిపూరాజనాలు పొన్నశ్రీరాజనాలు నివ్వరులు నీరుకావులు రెడ్డివంకెలు చౌటవరులు తీగెమల్లెలు సుఖభోగులు సన్నసూదులు గొరవంకరాజనాలు కాటుకరేకులు ముంగుర మొటికలు పసుపుముద్దలు మంచివిరులు రంభచెక్కిళ్ళు చిలుకముక్కులు మధురములు చామరాలు పెండెముడువులు రాచవన్నెలు తులసివనమాలికలు సింధుకర్పురాలు రాయమెచ్చులు యేరుమల్లెలు మునిమనోహరాలు వెండిగుండ్లు బొంతమడమలు కూటికుప్పలు కాఱుసంపెంగలు కందర్పభోగులు గజపతిలాగీలు బొందడీలు పునుఁగుఁదావులు తేనెతొలలు మోసనాలు గుఱ్ఱపుతోఁకలు తేటచలములు ఊదుఘటికలు గాజుకడియములు జాజి కుసుమలు దూసలు భీమగుదెలు యేడాకుమొలకలు గుజ్జరులు బిరుసులు జున్నుఁబ్రాలు చిన్నిచుక్కలు కళింగలు వంగవరులు జగన్నాథప్రియములు రామలక్ష్మణులు కలియుగమహిమలు కాసరులు కాశీప్రయాగలు షష్టికముయి గమ్మసరులు ననునూటనాలుగు వగల పైరుల చేరుడు బియ్యంపువట్టి ప్రసాదంబులు కలమాన్నంబులు కలవంటకంబులు పొంగలి పులియోగిర దధ్యోదనంబు తిరువీసంబు పరమాన్నం బానపాలు జున్నులు మీగడ తెరలు నవనీతంపుఘుటిక లొలుపుం బప్పు లప్పడంబులు వరుగులు వడియములు శాకత్రాతంపు బజ్జులు చారులు శిఖరులు పచ్చళ్ళూరుబిం డ్లావకాయ మొదలూఱుగాయలు చక్కెర ఖండచక్కెర జీనిచక్కెర కల్కడంబు పుల్ఖండంబు ద్వీపద్రాక్ష పనస కదళీచూత ఖర్జూరనాళికేళాది ఫలంబులు ముసురు