పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

55


సీ. ఒకచోట మునికూట సకలప్రణుతి ఝాట
            మొకమేర నతిధీర సుకవిధార
    మొకదండ వేదండ నికురుంబ హయకాండ
            మొకఛాయ ఘనగాయ కకృతగేయ
    మొకసీమ నిజధామ చకచక ద్యుతిభూమ
            మొకమూల భూపాల మకుటజాల
    మొకపొంత శశికాంత నికరాజిత ప్రాంత
            నొకక్రేవ నటభావ సుకరరావ
గీ. మమర నమరీశయ కుశేశయాభిరామ
   చామర సమీరణార్చక చలిత కైశ్యుఁ
   డగుచువేంకటభర్త సింహాసనమున
   నిండు కొలువుండెఁ గన్నులపండువుగను. 80

అపూర్వప్రయోగము



చ. సరిగ సలాము చేసి ముదిసన్నపుత్రాళ్ళు ధరించి మల్లుకై
    బిరబిర తానకంబు లివిడి పేర్కొని మీసలు దువ్వి బిత్తరిన్
    జొరవకు చొచ్చి వ్రేశి బరి చొంగణసీసమకక్తి చేబయున్
    గరవళము న్నృసింహమును గైకొని జెట్లను గాంచి వెంబడిన్. 81

సీ. కంబము కొణిదెలాగను డొల్ల తాటిదం
            డములు త్రోయంగ రెట్టల గమకము
    సంగడాల్ బూన బుజాలపు రాయంబు
            బరిలోడు ద్రిప్పు మేల్బరుల యుబ్బు
    బలుగోతమయి రళింపగ నురంబులటోకు
            పడి తాళములు సేయు తొడలకంటె
    మొరపుగ తిరుపట్టె కురుచలెత్తఁగ పొంచ
            ముల లాడు డంకలు బొరల మెడల
గీ. బలిమి గనిపెట్టి గంధపట్టె లెఱమట్టి
    కావి తిరుకాశదట్టులు గావుబొట్లు
    మొల్ల సరులొప్పు చరిత్రాటి పిల్ల జుట్లు
    పెద్ద చేత్రాళ్ళుగల జోడు బిరుదు జెట్లు. 82