పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

56

ప్రబంధరాజవేంకటేశ్వర


తే. కడఁగి దిశలు ప్రతిధ్వనుల్ బొడము నటులు
    గా మిగులు మల్ల జఱచి సలాము లిడుచు
    ముందఱను నిల్వఁగా డసదంది తత్క
    రమ్ము లిరుగేలఁ బూని పరాకటంచు. 83

చ. విడిచినయంత మల్లులటు వెన్కకుఁ జెంగున వింగడింపుచున్
    బడిబడి మీసలంటి మెలిబట్టుచు దండల నిల్చి కమ్ముచున్
    బిడికిళులూది పట్టుకొని బిట్టుగఁ గేకలు వేయుచున్ బొమల్
    ముడిగొనఁ బండ్లుగీటుచు సముద్ధతి చేఁజేయిసోఁక మీఁటుచున్. 84

క. భాయీ యిదెయొక నుడిలో
    మాయనుపించెదను చూడుమాయని కరిమై
    చాయఁగని ఱొమ్ము గ్రుద్దిన
    చాయగ గ్రుద్దుటను పెట్లు సరిగాఁ దాఁకెన్. 85

సీ. అత్తఱిఁగల బడిబిత్తరులను హత్తి
            చేతుల దట్లకాశెలను జేర్చి
    సుడిగాలి తిరగెడు వడుపున వడిజుట్టు
            కొంచు వైలాన లాగించివ్రేయు
    వ్రేటులో లాగించి వ్రేసి సమమ్ముగాఁ
            బుడమిపైఁ బడియంటు లిడకలేచి
    మెడలపైఁ గర్నాదులిడి పులుల్ వలెత్రాటఁ
            జిక్కి నఖమ్ములఁ జిమ్ముకరణి

గీ. రెమ్ముచును పొంచములు గూర్చి రెండుకడల
   నిరికి గళకత్తెరలు గట్టు టెఱిఁగి కూడ
   తిరుగఁబడి కురుల తగరుల్ ఢీకొనుగతి
   నురిది తలఁ దలఁ దాఁకించు నొకరికొకరు. 86

ఉ. కొక్కెసచే బిగింప మెడ గొబ్బుల కేల్వడిఁ బెట్టి దీసి మే
   ల్కక్కిత బట్టి త్రిప్పి చెయి లావును డుస్సుక రెండుప్రక్కలున్
   జొక్కరసందు వ్రేయఁ దొడనొక్కుచు సందెడఁ జేసి త్రోసి వెన్
   జక్కి సురాట మెక్కివడి జాఱి గడంబడ డింక బొర్లఁగన్. 87