పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 ప్రబంధరాజ వేంకటేశ్వర

నుంబోని వారాంగనల కటాక్షమార్గం బపేక్షించు బిరుదు కెంచపుమాష్టిలచాలును, మఱియు నొక్కచొప్పున నుప్పరిగల ముంగని చప్పరంబుల మధ్యరంగంబున నొప్పులకుప్పలై ముత్యపుఁజిప్పల చొప్పున విప్పులగు కనురెప్పల కప్పు దప్పనరికి బవరి తరితీపు చూపు చూపు తీరువుల తదీయముఖ పంకరుహ భ్రమద్భ్రమరవిభ్రమంబు పుట్టించు ప్రతిభవనభూపాలాకావరోధ కన్యకల కరాంచల హేమపాత్రికల దేజరిల్లు కర్పూరనీరాజనంబులవలనను, నేత్రోత్సవంబై వెలయు వలయు వైఖరీమండలాకారంబుగాఁ జుట్టును దిరుగు వీణావేణు శంఖకావాళ పటహ ఘనఢక్కా డమరు డిండిమ నిస్సాణ జర్ఝరీభేరీ మర్దళ మురజ తుత్తుంబికాది బహువిధ నిరవద్య వాద్యనిర్ఘోషంబును, శశిముఖీశయకుశేశయాధిష్ఠిత శాతకుంభకుంభ ప్రదీప్తదీపంబును అరాత్రిక పాత్రధారిణి పరంపరామంజుమంజీర సంజాత సింజానుపుంజరంజిత మణిమేఖలాఝణఝణత్కారంబునునై జూపట్టు తటిత్తు వేడుకల గైకొని గోవిందలిడుచు యెద్దులపై తమ్మటమ్ములు తిడిమి తిడిమని మ్రోయవేయుచు వచ్చు రోణంగి దాసరుల గంతులు గని నిజదివ్య త్రిభువనావనభవనాంగణంబున వేంచేసి తదనంతరంబున. 78

సీ. అలమేలుమంగామనోబ్జభృంగ పరాకు
యహరహర్దానవహర పరాకు
శ్రీతిరుపతిమహాసింహాసన పరాకు
దివిజాధినాథవైభవ పరాకు
సకలభక్తజనరక్షణవిచక్షణ పరాకు
జరవందితపదాంబుజ పరాకు
కమనీయసందీప్తగరుడవాహ పరాకు
శతకోటిమన్మథాకృతి పరాకు
గీ. దేవర పరాకు తిరుమలాధిప పరాకు
మాయురే! స్వామి చాఁగు భళా యటంచు
మాగధులు చేరి సముఖంబు వేగవిప్ప
నలువుమీఱంగ నిజవాహనంబు డిగ్గి 79