పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

53


రామబాణంబును నాగబంధంబును తొలకరిమెఱుపును అల్లినుత్తును విస్సందు హస్తాభరణంబును పదఖండనంబును నురిత్రాడును లోబిత్తరియు వెలిబిత్తరియు సర్పాంకుశంబును మొదలుగాఁగల పదిరెండు గాయమానంబులును, లోమొన వెలిమొన యుశిమొన చదురుమొన పుణ్యంపుమొన పాపంపుమొన చాటగుమొన దాటడుగుమొన కదలుమొన యరమీటుమొన నెరమీటుమొన సరితాశంబుమొన లాదిగాఁగల పదిరెండు మొనలును, లోవెలి గజ్జుదుముకు చూరణనఱుకు మొదలయిన యిరువగల నఱుకులు; దారుధాణు దడ యుద్భడ అంత్రటీక టీకనాట్యము ధారుఢాణ ఝాటుధాణు కపాలు దారుగపాలు ధాణు ధారుకఢాకు ఢాణుదారు ఝాటు మొదలగు పదునాల్గు విసరులు, కక్తి కొనడొక్కర ముత్తరడొక్కర కుమ్మరింబు జోడింపు సందుసీసంబును కొంతుమారును సమసీసమ్ము సురాటమ్ము చేబయు కందనంబును కర్లనంబును తొట్టను కిల్లియు బలి బడుటయు రొండివేటును పణంబును కర్నాతును భారంబును చొంగణయు పెట్లాగును రూణింపును సరిబిత్తరంబును లాగును వింటాలంబును తిణింగియు పాదనివారణము పదగశాప్తియు గళకత్తెరయు నృసింహంబును కాశినిలుకడయు నను ముప్పదిరెండు విన్నాణంబులును; దండనిల్కడ కదలుదుటు కలయు మెలఁకువ వింగళింపు దిశాపదిశలు పాదపుపారువ హస్తపుపారువ దేహపుపారువ నయనపుపారువ లివరాకడ యేకసరవైసర ఝంపు పిక్కు కరలాఘవంబు మొదలగు వితమ్ము లెఱింగి; అసి ముసల ముద్గర ప్రాసరోహణ కణయ కంపణ ముసుంఠి భల్లాతక భిండివాల పరశుగదా కుంతకోదండ కఠారిక తోమర త్రిశూల వజ్ర ముష్టి పరిఘాతల చక్రపట్టెస ప్రకూర్మ నఖర యోదండ నారాచంబులు లౌడి వంకిణి సబళ యీటె సెలకట్టె శిళ్ళను ద్వాత్రింశదాయుధంబులు, విచ్చలవిడి తచ్చెన కచ్చెలు దీసియు పెచ్చుమల్లాడియు గచ్చులు సేసియ హెచ్చుకత్తులు దూసియు ఘల్లుఘల్లురన నొకటిరెండు మొనలు బయలు చిమ్ములు చిమ్మి కమ్మిన ఝల్లుఝల్లన గుండెలదరి బెదరి ఝల్లున సందడివిరియ తెఱపిగని యిట్టలగు పట్టుల నిలిచి వీచు రొమ్ముముట్టెలును కావి దట్టీలును పులులెక్కిన యంగములు దుఱింగరింప జూపట్టు కరమ్ము కరంబుల నిలువు సానకత్తుల నెగుభుజంబుల నిక్కనొరిగి పెక్కుబెరిగి యిక్కువెఱిగి మాయామోహిని వర్గంబు