పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

51


నచ్చెంతనె జేరి జారువాటుగా నోరమోములఁ దెలియవేడి యేమేమి యెక్క డెక్క డనిన నచ్చిలుకలకొలుకులు వలకారి కలికి కపురపుఁ బలుకుల జలజలన యొలుకు బలుకులును బంగారు బొంగరంబుల హొరంగుల రంగుల తురంగలించు పొంగారు చన్నుంగవల తెఱంగులును, రత్నాంకిత తాటంక రుచులు తలంకక లంకెలు గొన నలికించు నకలంక సాంకవ పంక సంకలిత సంకుచిత రేఖాలంకరణంబులై యిరుగెలంకుల కుంకుమపు సుంకుల వెదచల్లు బింకపు చంకల పొంకంబును, చూచు నాసలి పైకొని యిట్టుట్టు నెడతెగిపోలేక పునుఁగు పిల్లులవలె చుట్టునుం దిరుగుచు నఱచేతుల కసిదీరఁ దోపుదోపుల బాలికల పాలిండ్లు పిసికిళ్ళం బట్టి నొక్కుచు గ్రుక్కిళ్ళజిక్కు సుకుమార విటకుమారుల వలనను, మఱియు నొక్కయెడ నెడమీనిమానిసి యుక్కలజిక్కి యువ్వ పాతఱలను మక్కినక్రియనూర్పు గాడ్పుల కవకాశంబు లేకునికి తమలోదా రొకరికొకరు పదరికొని పట్టునూలియల్లిక చేత్రాళ్ళగమకంబులును కటిసూత్రంబుల రసఘుటికల డంబులును సందిళ్ళమణుల తాయెత్తులును, జరాసులా యెత్తులును, గచ్చుకేడెమ్ములును మచ్చు వీడెంబులును నిలుపు మందుల కరాటంబులును, బయిటి బరాటంబులును నులిగొన్న కోఱమీసాల కనుంగొను గిరువు చూపులకోపులును, మచ్చువగలుజేయు మబ్బురాయుంటల మేపులును, మెలిబెట్టిచుట్టిన ముంజేకోకలును అగ్గలికలవేయు కేకలును, అంకుశపు టలుగుల క్రింది కొంకుల ములుకులుగ తగులుకొనిన యినుప సరిపెణల పెనఁకువగల యిఱ్ఱికొమ్ము సింగోటుల గుప్పుడులును కొండబూరుగ మాని చేవ కొఱడుల ద్రిప్పుడులును, పూలతురాయీల రాణించు చేకత్తుల గిలగిలలును, ఢీకెంచపాయంచు నగెడి పొగరు నగవుల కిలకిలలును వన్నెలాడాపట్టంపు జూపట్టు పటికెంపు జంబువాలును, పెక్కు లొక్కని పలుకు పికిళుల కేలును మడిమలు సోఁకనేగు పుటము లెగరుట వలనం బటువులగు పిరుదుల మురువు సగం బిరుదుగాఁ గనుపింపఁ బిక్కటిల్ల తొడగినట్టి నరిగకంగుల కూరుపుపనికవురు పరకాళి యొంటి పొర బిగువు నిడుదకాసెల రాగిల్లు గుల్లకావిగోచి చల్లడంబులపైఁ జుట్టిన గంధకావిదట్లు పొరలవరలు ముదురు బదనికల దనరు నరపెట్టులును నెన్నుదురుల వలపుల గొలుపు జేగుఱుకా విబొట్టుల చిట్టెలును పెద్దగోతమ్ము మురళించుట కతన టోడుగ్రమ్ము నురమ్ములమీఁద ననుపు