పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ix

నుండిరి. శ్రీకృష్ణరాయలవలె నన్నయభట్టుకాదుగదా తత్పూర్వ మెంత కాలము నుండియో కొందఱు బ్రాహ్మణులు రాజమంత్రులుగానుండి అమాత్య శబ్దవాచ్యులై యుద్ధవీరులై తమ రాజులను దేశములను రక్షించుచుండిరి. ఈ ‘కార్యఖడ్గ ప్రవీణ' శబ్దమునకు ఇదే యర్థము. తిక్కనామాత్యుని వంటివారు. ఈ విషయమునే మాతాతగారు తమ తిక్కన సోమయాజివిజయమను నుపన్యాసమున నిట్లు వ్రాసియున్నారు. (పుట3) ‘కవులు రాజామాత్యులైన నియోగి బ్రాహ్మణులయందు క్షత్రియ వీరోచితములయిన బలనీతి పరాక్రమ వైరిజయ శస్త్రాస్త్ర ప్రయోగ ప్రావీణ్యాది గుణవిశేషము లెల్లను విప్రోచితములై న వేదాది విద్యాధనత్వ కర్మఠత్వాది ప్రభావముంగూడను వర్ణింతురు', ఇది వట్టి వర్ణన మాత్రము కాదనియు ఎందఱో నియోగులు యుద్ధవీరులై రణమరణము నందియుండిరనియు, నేటి చరిత్ర పరిశోధనచే తెలియుచున్నది. ఖడ్గతిక్కన మనకు తెలిసినవాఁడే. ఆట్టివారెందఱో. పైగా వైదికుల కవిత బాగుండదను నభిప్రా యము గలవాఁడీకవి యనుట 'శ్రోత్రియుని తెలుఁగుకవిత' నీతడు నిరసించుటచే తెలియఁగలదు. (ప్రబం. 752)

కాని ఈ వేంకటకవి గాని, అతని తండ్రి అప్పయ మంత్రిగాని ఎవరి మంత్రులుగా నుండిరో తెలియదు వీరు నందవరీకులు. నియోగులలో ఆఱువేలవారు, ప్రాఙ్నాటి (పాకనాటి) వారు మాత్రమేగాక నందవరీకులును నున్నారు. అల్లసాని పెద్దన చొక్కయామాత్యుని పుత్రుఁడు. కాఁబట్టి వేంకట కవి కుటుంబమువారు ఎప్పుడో గణపరము వదలి రాజామాత్యులై మదరాసు ప్రాంతమునకు వచ్చియుండవలెను.

నాఁడు ఇంత పెద్ద మదరాసు లేదు. 1840 ప్రాంతములో ఇంగ్లీషువారప్పుడప్పుడే కోటను కట్టుకొని పైకి వచ్చుటకు ప్రయత్నించుచుండిరి. అందువలన నేటి మదరాసు ప్రాంతము నాటి తుండీర మండలము (తొండై మండలము) అనఁగా చెంజి రాజ్యము. దాని పాలకుఁడు చెంజివరదప్ప నాయకుఁడనియు నాతని కాలము క్రీ. శ. 1620-1660 ప్రాంతమని ముందుదాహరించితినిగదా. అతనికడ మంత్రులలో నొకఁడుగా నుండి యుండవలయును గణపవరపు అప్పయామాత్యుఁడు.

ఇందుల కనుగుణముగా వేంకటపతి యొక్క గురువు యతిరాజ వర్యుఁడు శ్రీమత్పెరుంబూదూరివాఁడు. ఈ యూరు మదరాసునకును కంచికిని