పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

viii

నివృత్తాంతమేమియుఁ జిక్కినదిగాదు. బట్టు రామరాజభూషణకవి వసుచరిత్ర యందు దనవృత్తాంతమును వ్రాయక హరిశ్చంద్ర నళోపాఖ్యానమున వ్రాసినట్టుగా నిక్కవియుఁ దక్కిన తన గ్రంథముల యందుఁ దన యుదంతమేమైన వ్రాసియుండునో విచారించుఁడు." ఆరుద్రగారికిని ఎక్కువ దొరక లేదు “ఈ ఊరు ఎక్కడుందో సరిగ్గా చెప్పలేం. కామేపల్లినే పొరపాటున లేఖకులు కాటేపల్లి అని వ్రాసుకొని ఉంటారు. గుంటూరు జిల్లా నరసారావు పేట తాలూకాలో కామేపల్లి గణపవరాలు ఉన్నాయి. కవి బహుశా అక్కడివాఁడే కావచ్చు." ఇటీవల కందుకూరు శ్రీవిద్వాన్ కే. రామానుజాచార్యులను నాంధ్రపండితులు ఈ కావ్యము పై నాసక్తి గలవారు ఈ గణపవరము చిలకలూరిపేట కడ నుండు గణపవరమని తమ యాశయమని తెలిపిరి. ఇతర ప్రమాణములు దొరకునంతవఱకు ఇది ఇంతే. ఇతఁడు గణపవరమువాఁడు. గణప' శబ్దముచే నీది. కాకతీయ గణపతి చక్రవర్తి యిచ్చిన యగ్రహారమేమో! కాని తాను జీతమును గడపినదంతయు దక్షిణదేశమునగదా చూడుఁడు -

“ఇది శ్రీమత్పెరుంబూదూరి యతిరాజాచార్యవర్య కరుణాకటాక్ష సంప్రాప్తాంధ్రకవితా సామ్రాజ్యధురంధర నీతియుగంధర నందవరకుల కలశ జలధి పూర్ణిమాచంద్ర సత్యహరిశ్చంద్ర వాసిష్ఠ గోత్ర పవిత్రస్తాశ్వలాయ సూత్ర కార్యఖడ్గప్రవీణ కామినీజన పంచబాణ కర్ణాట తుండీర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిల మహీమండలాఖండలదత్త మత్తసింధుర సైంధవాందోళికాచిరత్న రత్నాంబరాదివస్తు ప్రశస్తమందిర నిరంతరవసంతేందిందిర సకల కలావిచక్షణ నిఖిలశుభలక్షణ లక్షణకవి వేంకటపత్యమాత్యవర విరచితంబును మంగమాంబాసమేత గణపరాప్పయమంత్రిమణి విఖ్యాతమజ్జనకరూ పాల్మేల్ మంగాసనాథ తిరువేంగళనాథాంకితంబును నగు వేంకటేశ్వర నిఘంటువు”

అని యున్న దానిని (శ్రీపూండ్లవారు ఉదాహరించిరిగాని వ్యాఖ్యానింప లేదు. ఆరుద్రగారు దీనిని ఉదాహరింపనేలేదు. కాని దీనిని అరసిచూడఁగా నీతఁడు తనకాలములోనో తండ్రికాలములోనో మదరాసు ప్రాంతమునకు వచ్చి యుండవలయును. మొదటివిషయము చరిత్రకారుని దృష్టినాకర్షించునది “నీతి యుగంధర’ ‘అమాత్య’ ‘మంత్రి' శబ్దములును ‘కార్యఖడ్గప్రవీణ' యనునది. మొన్న మొన్నటివఱకును ఆంధ్రకవివరు లందఱును నియోగులే, రాజామాత్యులే. వారు ఎంతటి సాహితీసార్వభౌములో అంతటి సమరాంగణసార్వభౌములునుగా