పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-21] అధర్వణాచార్యుడు 81 క, భాషా నిరూపణం బా ర్యాషట్క-మునందుఁ &T"ex83 నాంధకవిశిరో భూషణము గు నన్నయసవి శేషంబుగఁ జెప్పె సంకుచితవాక్యములకా. పైనఁజూపిన సందర్భములనన్నిటిని నిష్పక్షపాతబుద్ధితో గమనించితి రేసి పండితులు నాయభిప్రాయముతో నేకీభవింపక పోరని నానమ్మకము. ఆపకు ములో నర్వణకారిక లధర్వణాచార్యకృతము గాక యహోబలపండితీయము లని నిస్సంశయముగా నిర్ణంపనచ్చును. ఆంధ్రశబ్దచింతామణి నన్నయకృతమనియు, నధర్వణకారిక లధర్వ ణునివనియు నిర్ణయించిన పండిత ప్రకాండులయందు విశేష గౌరవ ముంచుచు, వారితో భిన్నాభిప్రాయుఁడనై నాకు దోఁచిన యంశ ములను బాఠకలోకము నెడుట నుంచితిని. బ. శీ. వీరేశలింగముపంతులుగా రధర్వకారిక లక్వణా చార్యకృతములు కావని కొన్నియుక్తుల నాంధ్రకవుల చరితమున వాసియుండిరి. అవి వారి వాదమును నిస్సంశయముగా ధ్రువపఱచు నవి కావని కొందఱు పండితులు సమూధానముల నిచ్చియున్నారు. ఆచర్చనంతయు నిట వాయుట యనవసరము. శ్రీ పంతులు వారే, * ఎన్ని చూపినను, అవి యన్నియు సంభావ్యము లైనయూహలే కాని సెర్వివాదములైన సిద్ధాంతములు కావని యంగీకరించియున్నారు. శ్రీపంతులుగారు వ్రాసినవిషయములలో నొక భాష కొకఁడు రెండు వ్యాకరణములను రచింపఁ డనుమాటకు మాతము సరియైన సమాధానము గన్పడలేదు. వికృతివివేక మధర్వణుడు రచింపలేదని నిశ్చయమైనను, శ్రతిలింగశబ్దశాసనమధర్వణుఁడు రచించినదని కవి చరిత్సకారు లంగీకరించియున్నారు. అది ముద్రితమైనట్లు కన్పట్టదు. మదరాసు ప్రా. పు. భాండాగారమునిఁ బెక్కులు తప్పలతో నున్న యొక పతియున్నది. కాని దానిని నేనుజూచుట తటస్తింపలేదు.