పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెన్నెల కంటి అన్నయ్య

ప్రద్యుమ్నుఁడు వజ్రనాభునును బబావతికిని పరిపడిన పలికిన గెండక్షములు గల:

చ. సకల విశేష శోధనకు జాలిన యోనెఱజాణ జనా
భ కులవతంసరత్నమ ప్రభావతి రోహీతకంటకింబ తా
నక మగు చూపు నా పయి బవస్థిరాగతి బద్వె గాన న
త్య కలుషవృత్తి నాసమ్మతి మంతయు నేదు సుమీపలించులల్

అనుపద్యమును సూరనార్యుడు రచించినట్లే రెండర్థముల నిచ్చు పద్య మొకదానిని యన్న మార్వఁడును రచించి, నాయికచే నాయకునకు చి లు క మూలమున నంపించినాఁడు. కాని దురదృష్టవశ మున నాపద్యము గంథపాతము. కవిత్వమున బోలిక యంతగా లేకునను నితి వృత్తమున సామ్యముండుటచే నిందెవరైన నొకరు మరియొకరి ననుసరించిరా.... యని సంశయము కలుగు చున్నది. అన్నయ, సూరనార్యు ననుకరించెనేల్ని, యతడు పదునాఱవ శతాబ్ది వాడగును. బరిశోదింప వలసి యున్నది. ఈతని కవిత్వమును గూర్చి పీఠికా కారు లిట్లు వ్రాసి యున్నారు.

ఈ క వి దశకుమార చరిత్రమును మనస్సున నుంచుచుకొని యీ షోడశకుమార చరిత మును రచియించెను. కొన్ని కధలను గాధా సరిత్సాగరాదులనుండి సంగ్రహించి తన కవితా చమత్కిృతిచే పుష్టిని వర్ణనాధిక్యమును గలిగించి జన మేజయుని "రెండవ కమారుని గధానాయకునిగఁ జేసి యూతనికిఁ దోడుగ నతనిముంతి తనయులను, బురోహితపుత్తులను, దండనాథసుతులను బదేనుగుగను గూర్చి కధ సాగించినాఁడు.