పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ణము = కాల పట్టణము నల్లత్రాచు = కాలసర్పము వలె) బాపట్ల ا తాలూకాయండలి దగ్గు బాడీతని యత్తవారినివానాస మనినచో నది - యీ గ్రామమునకు సమీూపములో నుండును. ఇది కూడ నూహలమీూఁద కాదారపడిన దే. ఇంతకం టెను ముంచి యాధారముల విూఁద నాధార మఱియొక గ్రామము లభించినప్పడు దీనిని త్వజింతము. అంతవరకిదియే శ్రీనాథుని జన్మస్థాన మను కొందము నల్లూరు గ్రామమిప్పడు సుమారు రెండు వేల యకరము లు భూమిపరి మితమును రెండు వేలు జనసంఖ్యయుఁ గలిగియున్నది ఇది పాకనాటిలోనిది కాదని ఋజు వయ్యెనేని దీనిని విడచి వేయ వచ్చును. ఆచార్య శీ వేలటూరి వెంకటర మణయ్యగారు శ్రీనాథుని జన్మిన్గానము నెల్లూరు అని (భారతి-ఆంగీరస-మాఘము) వ్రాసి యున్నారు. అవచి తిప్పయ సెట్టికి తాత యగు పావాణి సెట్టి నినాసము నెల్లూకగుట ను శీనాథుడు తిప్పయ సెట్టికి శ్రీనాథుని జన్మస్థాన మన నొప్పు నని వారి యభిప్రాయము. కానీ “వారిధిటటీకాల్పట్టాణాధీశ్వరు" డను వాఖ్యక్య మును గార్చి వారీ వ్యాసమునఁ జెప్ప లేదు. నెల్లూరును శీనాథుఁడు విక్రమ సింహపురమని యే చెప్పియున్నాఁడు దానిని కాల్పట్టణ మని వాడి యుండఁడు. పానాటి సెట్టి నెలూరు వా స్తవ్యుఁ డైనను అతని కుమారుడైన దేవయ సెట్టి ప్రోలయ వేమారెడ్డికి బ్రాపై యద్దంకి వచ్చి యుండును. అనపోతారెడ్డికాలములొ రాజధానీ నగరము కొండ వీటికి నూర్పఁబడినప్ప డా తనితో బాటుగఁ గొండవీటికి వచ్చెనను శంకును నవ కాశము కలదు, శ్రీనాథుఁడును తిప్పయ సెట్టియుఁ బాల్యసఖులై యుండవచ్చును. ఇదమిర్ధమని నిర్ణయింపలేము.

నెల్లూరు శీనాథుని కాలమున నల్లూరు” అనిపిలువఁ బడు చుండెనా? ద్రావిడ కర్ణాట దేశములలో “నల్లూరు” అని పిలువఁబడు గ్రామములు చాలఁగలవు నల్లూరు ఆనగా సుందరమైన గ్రామమని యర్థము. నెల్లూరునకు సముద్రమిప్పడు దూరములోనున్నది. అప్పటి