6 ఆంధ్రకవితరంగిణి
కలో వ్రాసియున్నారు. ఈపద్యమునే యుదాహరించుచు శ్రీసోమశేఖరశర్మగారు సముద్రతీర గ్రామమును బట్టణమందురని భారతిలో వ్రాసియుండిరి.
ఈవాదములన్నియు నందదుకులవలె నున్నవని పాఠకు లనుకొనక మానరు. వాకనాటిలోఁ గాల్పట్టణమో తత్చబ్ధార్థ సూచక గ్రామమో లభించిన గానీ సర్వ జన సమ్మతమైన శ్రీనాథ జన్మ స్థానము స్థిరపడదు. తమ నివాస గ్రామము చిన్నదైనను, పేరు సరసముగా గానుపించక పోయినను దానిని సంస్కృతీకరించి, వాడు చుండుత కవుల కభ్యాసము. కంబము మెట్టను స్థంభగిరియనియు, బెజగొండను ఘనాద్రియనియు కవులు వాడి యున్నారు. ఇంకను నిట్టి యుదాహరణముల ననేకముగ జూప వచ్చును. కాల్పట్టణ మనగా నాకాలమున నదియొక పెద్ద వర్తక స్థానమైన సముద్ర తీర పట్టణమని యూహించి దానికై వెదికిన లాభము లేదు. అది ప్రఖ్యాత పట్టణ మైనచో నాపేరునే శ్రీనాధుడుదాహరించి యుండును. దాని చిన్నాములైన నిప్పుడుండక పోవు. అది యొక చిన్న గ్రామమై యుండుననియు దానికి గమలాభామాత్యుడు కరణమై, పండితుడై, ప్రజ్ఞావంతుడై ప్రతాప రుద్రుని కాలములో నాచుట్టు ప్రక్కలనున్న కొంత ప్రదేశమున కధికారమును సంపాదించి యుండుననియు దలంప వలసి యున్నది. గుంటూరు మండలమునందలి రేపల్లె తాలూకాలో నల్లూరను గ్రామ మొకటియున్నది. ఇదీ రేపల్లెకయిదు మైళ్ళదూరమునను సముద్రము నకు బదిమైళ్ళదూరమున నున్నది. అయిదువందల సంవత్సరములకు బూర్వము సముద్ర మీగ్రామమున కింకను సమీూపమున నుండియుండును. ఈగ్రామము పాకనాఁటిలోనిదే యన వచ్చును. పాకనాఁడు వెల నాఁడు కమ్మనాడులకు “సరిహద్దు"ల నిప్పడు సరిగానిర్ణయింపలేము.
ఈవల్లూరునే శీనాథుఁడు కాల్పట్టణమనినాఁడనినాయూహ.( వల్ల+ఊరు-వల్లూరు. వల్ల=కాల; ఊరు = పట్టణము. కాల + పట్ట