పుట:శ్రీసూర్య శతకము.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ణసృష్టైః పయోభిః
పూర్వాహ్నే విప్రకీర్ణా దిశిదిశి విరమ త్యహ్ని సంహారభాజః
దీప్తాంశోద్దీర్ఘ దుఃఖ ప్రభవభయభయోదన్య దుత్తార నావో
గావోవః పావనానాం పరమ పరిమితం ప్రీతి ముత్పాదయంతు.

ఈ శ్లోకమున శ్లేషోపము.

సూర్యకిరణ పక్షము ధేనుపరము
పయోభి:-జలము పాలు
సముచిత సమయం-ప్రాతఃకాలము వర్షాదికాలములయందు
పూర్వాష్టే విప్రకీర్ణా-మధ్యాహ్నమున చెదరిపోవును మధ్యాహ్నము మేతకు బోవును
సంహారరాజః-ఉపసంహృతి బొందును సాయంకాలము ఇండ్లకు చేరుకొనును.

సూర్యకిరణములు ప్రాతః కాలమున జలాదికములనిచ్చి, మధ్యాహ్నమున వ్యాపించి, సాయంకాలమున ఆస్తమించును. గోవులు ప్రొద్దుట పాలిచ్చి, మేతకుపోయి సాయంకాలము తిరిగివచ్చును. సూర్యకిరణ కాంతివలన దేవతాపరమైన కర్మల నాచరించి సంసార క్లేశము నుండి నరులు విముక్తులగుదురు. ఆవుపాలవలన దైనవిహితకర్మలను చేసి నరులు ముక్తిమార్గములను పొందుదురు. దీనికి వ్యాసమూర్తి శాస్త్రిగారి యాంధ్రీకరణము చూడుడు.

మ.సమయాకృష్ణ విసృష్ట పుష్కల వయస్సంప్రీతాత్మ ప్రజ
మ్మమితాఘ ప్రభవర్భవాబ్ధి కలమున న్ప్రా౦చత్సవిత్రోధిరా
జము ప్రాహప్రతిదిక్ప్ర కీర్ణము పునస్సాయం నివృత్తమ్ము గో
సమజ మర్కజ మిచ్చు మీ కమిత హర్షశ్రీ ప్రకర్షమ్ములన్.

ఇందు మూలపదములే యుండి - మూలశ్లోకమువలెనే యున్నది అనువాదమని తెల్పుటకు, యతిప్రాసలక్షణములు గలవు-దీని వలన మనకు మూల శ్లోకభావ మర్థము కాలేదు సరిగదా, తెలుగు పద్యమునకు వ్యాఖ్యానము కావలయున. శ్రీరామకవిగారెంత సులభసుందరముగా దీనిని తెనుగుచేసిరో చూడుడు.